ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రకు భారీ స్పందన వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల మంది ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకు 5కే అవగాహన పరుగును మున్సిపల్ కమిషనర్ కె. దినేష్‌కుమార్‌తో కలిసి ఎంపీపీ మార్గాని భరత్‌రామ్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహిస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నెల రోజుల పాటు ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహించనున్నట్లు తెలిపారు. నేటి నుంచి (డిసెంబరు 26 నుంచి) గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రస్థాయిల్లో టోర్నీ నిర్వహించనున్నట్లు ఆర్‌ఎంసీ కమిషనర్ దినేష్‌కుమార్ తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో-ఖో పోటీలు జరుగుతాయని.. జిల్లా వ్యాప్తంగా 512 సచివాలయాల్లో 1,74,953 మంది క్రీడాకారులు ఈ పోటీలకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థుల్లో 67,769 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
Also Read: Covid : ఏపీలో 29కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ