Site icon HashtagU Telugu

Huge Price Drop: కిలో టమాటా 2 రూపాయిలే …ఎక్కడో తెలుసా..?

10 KG Tomatoes

Tomato

అందనంత ఎత్తులో ఉన్న టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 1 కిలోకు  రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు పడిపోవడంతో, టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు. రేటు దారుణంగా పడిపోవడంతో కనీసం కూలి డబ్బులు కూడా తిరిగొచ్చే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాట ధర దారుణంగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులకు టమాటా ఎగుమతి అవుతుంది. దీంతో చుట్టుపక్కల రైతులతో పాటు దూరం నుంచి కూడా అన్నదాతలు తమ పంటను తీసుకొస్తారు.

ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో అప్పటికే మార్కెట్ కు తెచ్చిన పంటను ఆ ధరకు అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్ లోనే టమాట పంటను పారబోసి కన్నీళ్లతో వెళ్లిపోతున్నారు. టమాట రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరంగల్ మార్కెట్ లో 10 రోజుల క్రితం 1 కేజీ టమాట రూ 40 పలికిందని రైతులు చెప్పారు. సోమవారం రేటు ఒక్కసారిగా రూ 10 కి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Watch :

Exit mobile version