Tirumala Darshan: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 30 గంటలు!

వేసవి సెలవుల కారణంగా తిరుమల తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

Published By: HashtagU Telugu Desk
Ttd

Ttd

కలియుగ దైవంగా పేరొందుతున్న తిరుమల (Tirumala) తిరుపతికి దేశ నలుములాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఒకవైపు వరుస సెలవులు ఉండటం, సమ్మర్ వెకేషన్ కూడా ఉండటంతో భక్తులు, యాత్రికులు తిరుమలకు క్యూ కడుతున్నారు. గురువారం వేంకటేశ్వర స్వామికి దర్శించుకునేందుకు భక్తులకు దాదాపు 30 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. వేసవి సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది.

వైకుంటం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో (Devotees) కిటకిటలాడుతున్నాయి. తిరుమల ఆలయంలో బుధవారం సుమారు 79,207 మంది భక్తులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా,  ఆ ఒక్కరోజే 3.19 కోట్ల రూపాయల కానుకలు హుండీ లో వేసినట్టు ఆలయ ఆలయ నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం క్యూలైన్లలో ఉన్నవారు దర్శనం కోసం ప్రధాన ఆలయానికి (TTD Temple) చేరుకోవడానికి దాదాపు 30 గంటల సమయం పట్టింది. దర్శన సమయం పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.

గురువారం తెల్లవారుజాము నుంచే వైకుంటం క్యూ కాంప్లెక్స్-II పూర్తిగా నిండిపోయింది.  ఔటర్ రింగ్ రోడ్డులోని ఎంట్రీ పాయింట్ నుంచి క్యూ లైన్ వరకు భక్తులు చాలా దూరం నడిచి వైకుంటం క్యూ కాంప్లెక్స్ కు చేరుకుంటున్నారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు ఫుట్‌పాత్‌లు, పార్కులపై విశ్రాంతి తీసుకుంటున్నారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, ఆలయ సీనియర్ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆహారం, నీరు మరియు ఇతర నిత్యావసరాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. హనుమాన్‌ జయంతి ఉత్సవాల చివరి రోజు కావడంతో తిరుమలలోని అంజనాద్రి ఆకాశగంగ తీర్థంలో అంజనా దేవి సమేత బాల ఆంజనేయ స్వామికి ఈఓ ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవతలకు ప్రత్యేక అభిషేకం, సుదర్శన చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించారు.

Also Read: Virat Kohli: సెంచరీతో సమాధానమిచ్చిన కోహ్లీ.. విమర్శకులపై ఘాటుగా రియాక్షన్

  Last Updated: 19 May 2023, 12:41 PM IST