Site icon HashtagU Telugu

Srisailam : శ్రీశైలం ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు.. కార్తీక పౌర్ణ‌మి వేళ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

Srisailam

Srisailam

కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం నుంచే భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఆల‌యానికి త‌ర‌లివ‌చ్చారు. సోమ‌వారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం ప్రారంభించారు. పవిత్రమైన కార్తీక మాసం దృష్ట్యా దర్శనానికి భ‌క్తులు కాలినడకన వెళ్లేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను ఉదయం 4:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5:30 గంటల వరకు దర్శనానికి అనుమ‌తించ‌నున్నారు. ఆల‌యంలో ఆర్జిత చండీ హోమం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం క‌ల్పించేందుకు ఆర్జిత అభిషేకం, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కార్తీక పౌర్ణ‌మి సందర్భంగా క్యూ లైన్లలో వేచి ఉన్న భ‌క్తుల‌కు ఆల‌య అధికారులు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీటిని అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెల్లవారుజామున దశవిధ హారతి (పది రకాల కర్పూర నైవేద్యాలు) — ఓంకార హారతి, నాగ హారతి, త్రిశూల హారతి, నంది హారతి, సింహహారతి, సూర్య హారతి, చంద్ర హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి. దేవతల ఉత్సవ మూర్తులకు (ఊరేగింపు విగ్రహాలు) ప్రత్యేక పూజలు చేశారు పూజల సందర్భంగా ఆలయ గర్భగుడి ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి మండపంలో కూడా ఎనిమిది అడుగుల భారీ నాగుపాము కనిపించి భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఆలయ సిబ్బంది పాము పట్టే వ్యక్తిని తీసుకువ‌చ్చి దానిని పట్టుకుని సమీపంలోని అడవిలోకి విడిచిపెట్టాడు.

Also Read:  Telangana: కేసీఆర్ నడిచే రోడ్డు, చదివిన పాఠశాల కాంగ్రెస్‌ నిర్మించిందే: రాహుల్

Exit mobile version