Site icon HashtagU Telugu

Elections – Nomination : తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంతమంది నామినేషన్ వేశారంటే..!!

Nominti

Nominti

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల (Nominations) పర్వం మొదలైంది. నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలుకావడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు. పార్టీ నేతలు , అభిమానులు , కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి తమ నామినేషన్ కు సంబంధించి దాఖలు చేసారు. తెలంగాణ లో నిన్న ఒక్క రోజే దాదాపు 48 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీ తరుపు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో బిజెపి కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, ఆయన భార్య జమున, మహబూబ్‌నగర్ స్థానానికి డీకే అరుణ, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్, మెదక్ స్థానానికి రఘునందన్‌రావ్, నల్లగొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేయగా..కాంగ్రెస్ నుంచి నాగర్‌కర్నూల్ సెగ్మెంట్‌లో డాక్టర్ మల్లు రవి, జహీరాబాద్‌లో సురేష్ షెట్కర్, మెదక్‌లో నీలం మధు ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పిరమిడ్ పార్టీ, ప్రజావాణి పార్టీ, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ, సోషలిస్టు పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, విద్యార్థుల రాజకీయ పార్టీ, అలయెన్స్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీలకు చెందిన వారు, స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు.

ఇటు ఏపీ విషయానికి వస్తే అధికార పార్టీ అభ్యర్థులతో పాటు కూటమి పార్టీల అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు సైతం నామినేషన్ దాఖలు చేసారు. ఏపీలో మొత్తం మొదటి రోజు 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థుల కంటే ముందే కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఎవరికీ వారు తమ బలాన్ని చూపించుకుని ప్రయత్నం చేసారు. మంగళగిరి లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ ను కూటమి పార్టీల నేతలు రెండు సెట్లలో దాఖలు చేసారు. ఈ దాఖలు చేసే కార్యక్రమంలో వేలాది మంది పార్టీల కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నామినేషన్ల పర్వం పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Read Also : Voter Slip Download: పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు ఓట‌ర్ స్లిప్‌ను ఆన్ లైన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు..?

Exit mobile version