ఆంధ్రప్రదేశ్లో మద్యం (Alcohol ) సేవించేవారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 31.2 శాతం మంది మద్యం సేవిస్తున్నారని వెల్లడైంది. ఇది కేవలం పురుషులకే పరిమితం కాకుండా, మహిళల్లోనూ ఈ అలవాటు పెరుగుతోందని నివేదిక పేర్కొంది. అయితే ఏపీలో మహిళా మందుప్రియుల శాతం కేవలం 0.2 శాతమే ఉన్నప్పటికీ, ఇది ఆందోళన కలిగించే విషయమే. రాష్ట్రంలో రోజుకు సుమారు 50 లక్షల మంది మద్యం సేవిస్తుండగా, కోటికి పైగా ప్రజలు వారానికి ఒకసారైనా తాగుతున్నారని సర్వే చెబుతోంది.
ఈ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున నెలకు 11 క్వార్టర్ల మద్యం తాగుతున్నారు. ఇది చాలా అధిక సంఖ్య. దీనివల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మద్యం సేవించడం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు పెరుగుతుండటం భవిష్యత్తుకు ప్రమాదకరం. అందుకే ప్రభుత్వం ఈ అలవాటును తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Modi-Putin : పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్… భారత్ కు రావాలని ఆహ్వానం
ఇక దేశవ్యాప్తంగా చూస్తే.. అరుణాచల్ ప్రదేశ్లో మహిళలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నారని నివేదికలో తేలింది. అక్కడ ఏకంగా 17.2 శాతం మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది. ఈ గణాంకాలు దేశంలో మహిళల్లో కూడా మద్యం సేవనం పెరుగుతోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ అలవాటు సామాజిక, ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు కారణమవుతుంది.
మద్యపానం అనేది వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబం, సమాజంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మద్యం వల్ల కాలేయ వ్యాధులు, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి, ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచి, మద్యం అలవాటును తగ్గించడానికి తగు కార్యక్రమాలు చేపట్టాలి.