Non Hindu Employees : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్యమతస్తుల అంశంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. వారి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ? హిందూయేతర మతాలకు చెందిన ఆ ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేస్తారా ? వీఆర్ఎస్ ఇస్తారా ? అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఈ అంశంపై ఏపీ సర్కారు కసరత్తును ప్రారంభించిందని సమాచారం. ఈనేపథ్యంలో టీటీడీలోని అన్య మతాల ఉద్యోగులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు.
Also Read :US Vs Russia : అమెరికాకు రష్యా భయం.. ఉక్రెయిన్ రాజధానిలో ఎంబసీకి తాళం
గతంలోకి వెళితే.. ప్రస్తుతం టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్య మతస్తులంతా 2007 సంవత్సరం కంటే ముందు రిక్రూట్ అయినవారు. 2007 తర్వాత అన్య మతస్తులను టీటీడీ రిక్రూట్ చేసుకోలేదు. ఎందుకంటే.. హిందూయేతరులను(Non Hindu Employees) తిరుమలకు సంబంధించిన ఉద్యోగులలో నియమించకూడదని 2007లో ఉత్తర్వులు వచ్చాయి. కొత్తగా నియమించుకునే వారి మత విశ్వాసాలపై ఎంక్వైరీ చేశాకే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. 2007 కంటే ముందు టీటీడీలోని వివిధ విభాగాల్లో రిక్రూట్ అయిన వారిలో చాలా మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు. 2017లో నాటి ఓ టీటీడీ అధికారిని చర్చిలోకి వెళ్లడం వివాదానికి దారితీసింది. ఆమెపై అప్పట్లో హిందూ సంఘాలు టీటీడీకి ఫిర్యాదు చేశాయి.
Also Read :Upasana : అయ్యప్ప మాలలో కడప దర్గాకు రామ్‌చరణ్.. విమర్శలపై ఉపాసన రియాక్షన్
ప్రస్తుతం తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 44 మంది మాత్రమే అన్యమతస్తులు ఉన్నారు. వీరిలో 39 మంది 2007 కంటే ముందే రిక్రూట్ అయ్యారు. వీరిలోనూ అత్యధికులు కారుణ్య నియామకాల కింద రిక్రూట్ అయిన వారే కావడం గమనార్హం. హిందూయేతర ఉద్యోగులంతా తిరుపతి పరిధిలో డ్రైవర్లు, అటెండర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తిరుమలలో దాదాపు 7వేల మంది శాశ్వత ఉద్యోగులు, 14వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే హిందూయేతర టీటీడీ ఉద్యోగులను తొలగిస్తామని అప్పటి టీటీడీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అయితే ఆ ప్రకటన అమల్లోకి రాలేదు.