ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరుశాతం.. కారణం ఇదేనా?

కరోనా మొదటి రెండవ దశ తరువాతఏపీలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు ఆగష్టు 16వ తేదీనుంచి పునః ప్రారంభమైయ్యాయి. అయితే మొదట్లో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిందండ్రులు భయపడ్డారు.

  • Written By:
  • Publish Date - October 14, 2021 / 02:48 PM IST

కరోనా మొదటి రెండవ దశ తరువాతఏపీలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు ఆగష్టు 16వ తేదీనుంచి పునః ప్రారంభమైయ్యాయి. అయితే మొదట్లో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిందండ్రులు భయపడ్డారు. ఆ తరువాత క్రమంగా కరోనా తగ్గుముఖం పడటంతో పూర్తిస్థాయిలో పాఠశాలలకు పిల్లలు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభంలో హాజరుశాతం 73% ఉండగా అది క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 91%కి పెరిగింది.అయితే విద్యార్థుల్లో చాలా మంది కరోనా బారిన పడుతుండటంతో కొంద ఆందోళన తల్లిదండ్రుల్లో కలుగుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమై దాదాపుగా రెండునెలలు కావోస్తుంది.కరోనా మొదటి,రెండవ దశల తరువాత పాఠశాలలు తెరిచిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.పాఠశాలల్లో హాజరు ఆగష్టులో73% ఉండగా సెప్టెంబర్లో 82%,అక్టోబర్లో 85%కి పెరిగిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తాజా హాజరు శాతం 91% కి చేరిందని ఉన్నతవిద్యాశాఖ అధికారులు సీఎం జగన్మోహన్రెడ్డికి తెలిపారు.పాఠశాలల్లో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదని అధికారులు సీఎంకు వివరించారు.
దేశ వ్యాప్తంగా పిల్లలకు వ్యాక్సిన్ పక్రియ ప్రారంభంకాలేదు.కానీ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్రార్థకంగా మారుతుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించింది.అయితే మూడవ దశ కరోనా చిన్ని పిల్లల మీద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.పిడియాట్రిక్ సంబంధించిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం వైద్యశాలలో ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.రెండు నుంచి 18 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు భారత్ బయోటెక్ సిద్దమైంది.దీనికి డీజీసీఐ నుంచి అనుమతి కోసం భారత్ బయోటెక్ వేచి చూస్తుంది. అయితే అందుబాటులోకి వస్తుందనేది స్పష్టత లేదు. మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులు,ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు.సెప్టెంబర్ మొదటి వారంలోనే 293 మంది విద్యార్థులు,143 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.97% పైగా ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయించామని ప్రభుత్వం తెలిపింది.కానీ అక్కడక్కడ ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం వారిలో ఆందోళన కలిస్తుంది.

రెసిడెన్షియల్ స్కూల్స్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది.సెప్టెంబర్ 22న విశాఖ పట్నంలోని బాయ్స్ రెసిడెన్సియల్ స్కూల్లో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.ఇటీవల జవహార్ నవోదయ రెసిడెన్సియల్లో 59 మంది విద్యార్థులు,నలుగురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని…నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు.పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయం,సెంట్రల్ స్కూల్లో పాజిటివ్,నెగటివ్ వచ్చిన విద్యార్థులను వేరువేరుగా ఉంచారు.బాధిత విధ్యార్థులు కోలుకునే వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది.మరోవైపు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పాఠశాలలను సందర్భానుసారంగా మూసివేతపై నిర్ణయం తీసుకుంటున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు జలుబు,దగ్గు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైన విద్యార్థులు వైరస్ బారిని పడితే పాఠశాల మొత్తాన్ని శానిటైజేషన్ చేస్తున్నామని..మిగిలిన విద్యార్థులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.పాఠశాలల్లో కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ ప్రభావం ఉన్న విద్యార్థుల విభాగాలకు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు ఇస్తున్నామని తెలిపారు.

పాఠశాలలో ప్రతి విద్యార్థి శానిటైజేషన్, మాస్క్, భౌతిక దూరం ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని… ఒక తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.ఇది సాధ్యం కాని పాఠశాలల్లో రోజు విడిచి రోజు చొప్పును వివిధ విభాగాలకు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.ఇటు ప్రవేట్ పాఠశాల్లో కూడా హాజరుశాతం పెరిగిందని ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్వీ రామచంద్రారెడ్డి తెలిపారు.కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థులను తరగతులకు హాజరుకావొద్దని చెప్తున్నామని…కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు, అనేక ప్రైవేట్ పాఠశాలలు కూడా ఆఫ్లైన్ తరగతులకు మారాయని, ఆన్లైన్ తరగతులు పూర్తిగా ఆగిపోయిందని ఆయన తెలిపారు.