House Remond rejected : జైలులో చంద్ర‌బాబు ఎన్నాళ్లు..? ఏసీబీ కోర్టులో ఏం జ‌రుగుతోంది.?

House Remond rejected : చంద్ర‌బాబు హౌస్ రిమాండ్ పిటిష‌న్ ను కూడా ఏసీబీ కోర్టు జ‌డ్జి తిర‌స్క‌రించారు.ప్ర‌త్యామ్నాయం దిశ‌గా లూత్రా టీమ్

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 05:31 PM IST

House Remond rejected : చంద్ర‌బాబు హౌస్ రిమాండ్ పిటిష‌న్ ను కూడా ఏసీబీ కోర్టు జ‌డ్జి తిర‌స్క‌రించారు. దీంతో ప్ర‌త్యామ్నాయం దిశ‌గా లూత్రా టీమ్ ఆలోచిస్తోంది. ఇళ్లు కాదు జైలులోనే భ‌ద్ర‌త ఉంద‌ని జ‌డ్జి న‌మ్మారు. వైద్య స‌దుపాయాల‌తో పాటు ర‌క్ష‌ణ కూడా జైలులోనే బాగుంద‌ని ఏపీ సీఐడీ చేసిన వాద‌న‌తో జ‌డ్జి హిమ‌బిందు ఏకీభ‌వించారు. దీంతో ఇక జైలు జీవితం మ‌రికొన్ని రోజులు చంద్ర‌బాబు గ‌డ‌పాల్సి ఉంది. ప‌లు కేసుల‌పై విచార‌ణ‌ను ఆపాల‌ని హైకోర్టులో చంద్ర‌బాబు త‌ర‌పున న్యాయ‌వాదులు పిటిష‌న్లు వేశారు. వాటితో పాటు ఏసీబీ కోర్టు తాజాగా తిర‌స్క‌రించిన హౌస్ రిమాండ్ పిటిష‌న్ ను స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డానికి లూత్రా టీమ్ సిద్ధ‌మ‌వుతోంది.

హౌస్ రిమాండ్ పిటిష‌న్ ను స‌వాల్ చేస్తూ హైకోర్టులో (House Remond rejected)

ఎడ‌తెగ‌ని సీరియ‌ల్ త‌ర‌హాలో న‌డుస్తోన్న చంద్ర‌బాబు అరెస్ట్, జైలు, బెయిల్ అంశంపై కోర్టులో సీన్ న‌డుస్తోంది. ప్ర‌ముఖ న్యాయ‌వాదులు వాదిస్తోన్న వాద‌న‌లు జ‌డ్జి హిమ‌బిందుకు సంతృప్తి క‌లిగించ‌లేక‌పోయాయి. ఏపీ సీఐడీ వాద‌న‌ల‌తో ఆమె ఏకీభ‌విస్తున్నారు. తొలి రోజు 409 సెక్ష‌న్ మీద జ‌రిగిన వాద‌న‌ల‌ను సావ‌దానంగా విన్న ఆమె ఇచ్చిన తీర్పు కోసం క్రికెట్ లో 20-20 మ్యాచ్ ను చూసిన‌ట్టు అంద‌రూ చూశారు. తీరా, ఆమె ఆ సెక్ష‌న్ అప్లిక‌బుల్ అంటూ చెప్ప‌డంతో చంద్ర‌బాబుకు ఇక జైలు త‌ప్ప‌ద‌ని తేలిపోయింది. అర్థ‌రాత్రి వ‌ర‌కు న‌డిచిన ఆ ఎపిసోడ్ ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు కు చంంద్ర‌బాబును పంప‌డంతో ముగిసింది. ఆ త‌రువాత హౌస్ రిమాండ్.(House Remond rejected ) పిటిష‌న్ టెన్ష‌న్ టీడీపీ శ్రేణుల్లో మొద‌ల‌యింది.

Also Read : Jagan Script : ఒక జ‌డ్జిమెంట్ బోలెడు కోణాలు.!

సోమ‌వారం వాద‌న‌లు విన్న జ‌డ్జి తీర్పును మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. ఇరుప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న త‌రువాత హౌస్ రిమాండ్ పిటిష‌న్ ను హిమ‌బిందు తిర‌స్కరించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నిరాశ నెల‌కొంది. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కుటుంబీకులు జైలులో ఆయ‌న్ను క‌లిశారు. భ‌ద్ర‌త‌పై అనుమానాన్ని వ్య‌క్త‌పరిచారు. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, లోకేష్‌, బ్రాహ్మ‌ణి జైలుకు వెళ్లి చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయ్యారు. ఆ త‌రువాత మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు భ‌ద్ర‌త మీద అనుమానాలు ఉన్నాయని భువ‌నేశ్వ‌రి ఆందోళ‌న వ్య‌క్త‌ప‌రిచారు.

కేసుల విచార‌ణ‌ను ఆపాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్లు

ఏసీబీ కోర్టులో చంద్ర‌బాబుకు న్యాయం జ‌ర‌గ‌డంలేద‌ని టీడీపీ క్యాడ‌ర్ భావిస్తోంది. జ‌డ్జి హిమ‌బిందు తిర‌స్క‌రించిన హౌస్ రిమాండ్ పిటిష‌న్ ను హైకోర్టులో చంద్ర‌బాబు న్యాయవాదులు స‌వాల్ చేయ‌నున్నారు. అక్క‌డ న్యాయం జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు త‌ర‌పు న్యాయ‌వాదులు విశ్వ‌సిస్తున్నారు. దానితో పాటు చిత్తూరు జిల్లా అంగ‌ళ్లు వద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో చంద్ర‌బాబు ఏ1గా ఉన్నారు. అమ‌రావ‌తి రింగ్ రోడ్ అలైన్మెంట్, అసైన్ భూముల వ్య‌వ‌హారం, ఏపీ ఫైబ‌ర్ నెట్ తో పాటు ప‌లు కేసుల్లో నిందితునిగా చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పేర్కొంది. ఆ కేసుల విచార‌ణ‌ను ఆపాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు ప‌రిచారు. వాటి మీద స్టే వ‌స్తే చంద్ర‌బాబు సేఫ్ గా బ‌య‌ట‌ప‌డే అవకాశం ఉంది. ఒక వేళ స్టే రాక‌పోతే మాత్రం ఆయ‌న ఎప్పుడు జైలు (House Remond rejected) నుంచి వ‌స్తారు? అనేది సందిగ్ధం.

ఏసీబీ కోర్టులో చంద్ర‌బాబుకు న్యాయం జ‌ర‌గ‌డంలేద‌ని

ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్న చంద్ర‌బాబు బ‌య‌ట‌కు రాగానే మ‌రో కేసులో అరెస్ట్ చేయ‌డానికి ఏపీ సీఐడీ సిద్ధంగా ఉంది. ఇలా ప‌లు కేసుల్లో అరెస్ట్ చేస్తూ కోర్టుకు హాజ‌రు ప‌రుస్తుంటే చంద్ర‌బాబు జైలు జీవితం ఇప్ప‌ట్లో ముగియ‌దు. అంతేకాదు, సీఐడీ క‌స్ట‌డీ పిటిష‌న్ వేసింది. ఏసీబీ కోర్టులో వేసిన క‌స్ట‌డీ పిటిష‌న్ కు అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌ని టీడీపీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు. ఒక వేళ చంద్ర‌బాబును క‌స్ట‌డీకి ఇస్తే ఆయ‌న్ను సిట్ కార్యాల‌యంకు తీసుకువ‌చ్చి విచార‌ణ చేస్తార‌ని తెలుస్తోంది. మొత్తం కేసుల మీద కేసులు, పిటిస‌న్ల మీద పిటిష‌న్లు వేస్తే ఏదో ఒక ర‌కంగా జైలు నుంచి చంద్ర‌బాబును బ‌య‌ట‌కు రాకుండా చేసే ప‌ద్మ‌వ్యూహాన్ని జ‌గ‌న్ అండ్ టీమ్  (House Remond rejected) ర‌చించింది.

Also Read : YCP MP Mopidevi : ఇక టీడీపీకి ప్ర‌తిరోజు సినిమా చూపిస్తాం : ఎంపీ మోపిదేవి

అప‌ర చాణ‌క్యునిగా పేరున్న చంద్ర‌బాబు ప్ర‌స్తుతం క‌ష్టాల్లో ఉన్నారు. ఆయ‌న ఊహించ‌ని విధంగా జైలుకు వెళ్లారు. గ‌తంలో జైలుకు వెళ్లిన మాజీ సీఎంలు లాలూ, జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధిల‌తో చంద్ర‌బాబును పోల్చ‌డానికి లేదు. ఎందుకంటే, జైలుకు వెళ్లిన మాజీ సీఎంల‌పై ఆధారాల‌తో కూడిన ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో చేశారు. వాటి సంబంధించి ఎఫ్ ఐఆర్ లు కూడా ఉన్నాయి. కానీ, ఎఫ్ ఐఆర్ లో చంద్ర‌బాబు పేరు లేకుండానే అరెస్ట్ చేసిన కేసు ఇది. అంతేకాదు, రిమాండ్ రిపోర్ట్ లోనూ ఏ 37గా ఉన్నారు. అంటే, ఆయ‌న కంటే ముందు 36 మంది స్కిల్ డ‌వ‌లెప్మెంట్ కేసులో ఉన్నారు. వాళ్ల‌ను విచార‌ణ చేయ‌కుండా చంద్ర‌బాబును నేరుగా జైలుకు పంపించారు. ఫైలును తయారు చేసిన ఐఏఎస్ ల‌ను వ‌దిలేశారు.

ఇప్ప‌ట్లో చంద్ర‌బాబును జైలు  నుంచి రానిస్తారా?(House Remond rejected) 

ఏ త‌ప్పు చేయ‌ని చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డం ఏమిటి? అంటూ మాజీ ఐఏఎస్ ర‌మేష్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ఆయ‌న ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా పీవీ ర‌మేష్ ఉన్నారు. ఆయ‌న‌కు ఈ మొత్తం నిధులు ఎలా వెళ్లాయి? అనేది తెలుసు. అందుకే, ఆ నిధుల విడుద‌ల కోసం ఫైల్ త‌యారు చేసిన ఐఏఎస్ ల‌ను ఎందుకు విచార‌ణ చేయ‌డంలేదంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు .ముందుగా వాళ్ల‌ను అరెస్ట్ చేయాలంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను లండ‌న్ నుంచి వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ గా తీసుకున్నారు.

మేఘా కంపెనీ నుంచి ఆయ‌న్ను రాజీనామా చేయించారు. ఆ కంపెనీకి ఓన‌ర్లుగా శ్రీనివాస‌రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. ప‌ట్టిసీమ లో మేఘా అవినీతికి పాల్ప‌డింద‌ని అప్ప‌ట్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. సీన్ క‌ట్ చేస్తే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మేఘా కంపెనీతో కొన్ని టీవీ ఛానళ్ల లో పెట్టుబ‌డులు పెట్టించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆ కంపెనీకి అప్ప‌గించారు. ఇప్పుడు ఆ కంపెనీలో ప‌నిచేస్తోన్న పీవీ ర‌మేష్ తో రాజీనామా చేయించార‌ని టాక్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అనడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహ‌ర‌ణ‌. ఇలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న ఆయ‌న ఇప్ప‌ట్లో చంద్ర‌బాబును జైలు  (House Remond rejected) నుంచి రానిస్తారా? అనే అందోళ‌న టీడీపీని వెంటాడుతోంది.