AP Assembly : టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీ వెళ్లి దీక్ష చేయడం ఏంటి జగన్..? – హోంమంత్రి అనిత

వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి.. సభకు రాలేదని ఎద్దేవా చేశారు

Published By: HashtagU Telugu Desk
Anitha Jagan

Anitha Jagan

కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్రంలో హత్యలు , నేరాలు పెరిగిపోయాయని..36 రాజకీయ హత్యలు జరిగాయని వాపోతూ జగన్ (Jagan) నిన్న ఢిల్లీ లో ధర్నా (Dharna) చేయడం ఫై హోంమంత్రి అనిత (Home Minister Anitha) అసెంబ్లీ (AP Assembly) లో ఘాటుగా స్పందించింది. వైసీపీ నేతలపై దాడులు జరిగాయా? లేదా? అని ప్రశ్న పంపించి.. అసెంబ్లీకి రాకుండా పోతే ఎలా జగన్ అని అనిత ప్రశ్నించారు. వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి.. సభకు రాలేదని ఎద్దేవా చేశారు. నిజానికి టీడీపీ వాళ్లను చంపి అదేదో తాము చేసినట్టు ఆరోపిస్తున్నారని, అధికారం కోల్పోయి.. 11 సీట్లు సాధించాక టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీవెళ్లి అక్కడ దీక్షచేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నలుగురు చనిపోతే ముగ్గురు టీడీపీకి చెందిన వారు ఉన్నారని, దానికి సంభందించి కేసు నెంబర్లతో సహ వెల్లడించామని అనిత తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అంటున్నాడు..మరి ఆ 36 మంది పేర్లు వెల్లడించవచ్చు కదా..? వారు ఎవరు..? ఏ పార్టీకి చెందినవారు..? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది విచారిస్తాం..కానీ ఆ వివరాలు ఏవి తెలుపకుండా ఉంటె ఏంటి దాని అర్ధం అని అనిత ప్రశ్నించింది. గత ప్రభుత్వంలో ఆత్మకూరుకు ప్రతిపక్షనేత చంద్రబాబు వెళ్ళాలనుకుంటే ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారని, పవన్ కళ్యాణ్‌ అమరావతి రైతుల వద్దకు వెళితే ముళ్లకంపలు వేశారని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు స్టూల్ ఎక్కి నిల్చోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని అనిత గుర్తు చేసారు.

Read Also : TG Assembly : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు ఎంతంటే..!!

  Last Updated: 25 Jul 2024, 03:35 PM IST