Site icon HashtagU Telugu

Home Minister Anita : పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చిన హోం మంత్రి అనిత

Home Minister Anita Gave Fu

Home Minister Anita Gave Fu

హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత (Home Minister Anita).. . ఈరోజు విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆమె పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చారు.. గంజాయి విషయంలో ఎక్కడ తగ్గొద్దని రాత్రి 8 తర్వాత ఎవరైనా గుంపులు, గుంపులుగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వంలో కొంత మంది పోలీసు అధికారులు ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ..ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టు వ్యవహరిస్తున్నారని, అటువంటి వారికి జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, మూడు నెలల్లో మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ సర్కారు గంజాయి నిర్మలనపై చర్యలు తీసుకోలేదని, గంజాయి వల్ల విశాఖలో నేరాల రేట్ పెరిగిందని తెలిపారు. గంజాయి కేసుల్లో 1,230 మంది విశాఖ జైలులో ఉన్నారని తెలిపారు. ఇకపై గంజాయి వ్యాపారం చేద్దామన్న ఆలోచన ఉంటే వారు దాన్ని వెంటనే విరమించుకోవాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని హోం మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్నను కోరుకున్నట్టు ఆమె వెల్లడించారు.

Read Also : AP Assembly sessions : జూన్ 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు