BJP Leaders: సుజ‌నా, సీఎం ర‌మేష్ ల‌కు అమిత్ షా క్లాస్‌…?

బీజేపీ రాజ్యస‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు గంట‌కు పైగా స‌మావేశం నిర్వ‌హించారు.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 12:08 AM IST

బీజేపీ రాజ్యస‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు గంట‌కు పైగా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఏపీలోని తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. అయితే స‌మావేశంలో సుజ‌నా, సీఎం ర‌మేష్ ల‌కు అమిత్ షా క్లాస్ తీసుకున్నార‌ని స‌మాచారం.ఇటీవ‌ల సీఎం ర‌మేష్ బ‌ద్వేల్ ఉప ఎన్నిక స‌మ‌యంలో బీజేపీ, టీడీపీ పొత్తు పై మీడియాలో వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ క్యాడ‌ర్ లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొన‌డం, ఆ వ్యాఖ్య‌లు రాష్ట్ర పార్టీ సీరియ‌స్ గా తీసుకుంది. ఇదే విష‌యంపై ఏపీ ప‌ర్య‌ట‌కు వ‌చ్చిన అమిత్ షా ఇద్దరి నేత‌ల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ స‌మావేశంలో పొత్తుపై మాట్లాడ‌వ‌ద్ద‌ని క్లాస్ తీస‌కున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు టీడీపీ నుంచి రావ‌డంతో టీడీపీ నేత‌ల‌తో స‌న్నిహితంగా ఉంటున్నార‌ని బీజేపీ లో ఓ వ‌ర్గం ఆరోపిస్తుంది. దీనిపై కూడా అమిత్ షా వారికి క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో దూరం పాటించాల‌ని ఇద్ద‌రు నేత‌ల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం.

Also Read : విభ‌జ‌న ఆస్తుల‌పై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి – తెలంగాణ‌కు అమిత్ షా ఆదేశం

మ‌రోవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు పురంధేశ్వ‌రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. భేటి అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా మాకు దిశా నిర్దేశం చేశార‌ని వీర్రాజు తెలిపారు. ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024 లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించుకుంటామ‌ని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని… ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పారని వీర్రాజు తెలిపారు. ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుంది. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశార‌ని బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు పురంధేశ్వ‌రి తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామ‌ని ఆమె తెలిపారు. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చింద‌ని… మిగిలిన అంశాల‌ను కూడా బీజేపీ నేర‌వేరుస్తుంద‌ని పురంధేశ్వ‌రి తెలిపారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని.. దీనిపై కుడా పోరాటం చేస్తామ‌ని ఆమె తెలిపారు.