Site icon HashtagU Telugu

Tadikonda : తాడికొండ భూములకు రెక్కలు

Tadikonda Amaravathi Lands

Tadikonda Amaravathi Lands

అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ (Amaravati Real Estate Market) మళ్లీ పుంజుకుంది. ప్లాట్ల కొనుగోళ్లకు గట్టి ఊతమిచ్చే దిశగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తో అమరావతి రాజధాని అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. గత ఐదేళ్లుగా స్థిరంగా ఉన్న భూ ధరలు, టీడీపీ విజయం తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తాడికొండ, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు భారీ స్థాయిలో వెంచర్లు ప్రారంభమయ్యాయి. అయితే రాజధాని పనులు నిలిచిపోవడంతో అక్కడ భూముల కొనుగోలు, అమ్మకాలు నెమ్మదిగా జరిగాయి. కానీ ఇప్పుడు అభివృద్ధి తిరిగి పట్టాలెక్కే సూచనలు కనిపించడంతో, ఎంక్వయిరీలు, సైట్ విజిట్‌లు గణనీయంగా పెరిగాయి.

Janhvi Kapoor Reflects on 4 Years of #Roohi and Her First Solo Dance Number

గత కొంతకాలంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు, భూస్వాములు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థలాలు కొనుగోలు చేసిన వారిలో కొందరు టెన్షన్‌కి గురైనా, తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా 200 గజాల స్థలాన్ని సుమారు 25 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న స్థలాల ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా, భవిష్యత్తులో అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే, ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా ముందుకు సాగుతాయని రియల్టర్లు భావిస్తున్నారు.

Ranya Rao : నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు

ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ భవిష్యత్తు, అమరావతి అభివృద్ధిపై ఆధారపడి ఉంది. రాజధాని నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో మొదలైతే, భూములపై మరింత డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితిలో, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టేవారికి ఇది మంచి అవకాశం కావొచ్చు. అమరావతి మెట్రో సిటీగా మారుతుందన్న నమ్మకం పెరిగితే, భూయజమానులకు, రియల్టర్లకు మరింత లాభదాయకంగా మారనుంది.