Hijras on Balakrishna: వైసీపీ స్కెచ్.. బాలయ్యపై పోలీసులకు హిజ్రాల ఫిర్యాదు!

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నాయకులు నువ్వానేనా అన్నట్టుగా ఒకరిపై మరికొరు విమర్శలు చేసుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Balakrishna

Balakrishna123

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నాయకులు నువ్వానేనా అన్నట్టుగా ఒకరిపై మరికొరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హీరో బాలయ్య పై హిజ్రాలు పోలీస్ కంప్లైట్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హిజ్రాలు. తమ ఎమ్మెల్యే కనిపించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళ్తున్నారని, ఆయన తమకు కనిపించడంలేదని వెతికిపెట్టాలని పోలీసులను కోరారు. హిజ్రాల వెంట వైసీపీ నేతలు కూడా ఉన్నారు.

పక్కా ప్లానింగ్ తో.. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలయ్యకు సోషల్ మీడియాలో అదే రీతిలో జవాబిచ్చారు వైసీపీ నేతలు ఇప్పుడు నేరుగా ఆయన నియోజకవర్గంలోనే ఆయన్ను టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ హిజ్రాలతో ఫిర్యాదు చేయించారు.

చంద్రబాబుని ఓడించడంతోపాటు.. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంని కూడా చేజిక్కించుకోవాలనేది వైసీపీ ఆలోచన. అందులో భాగంగానే హిందూపురంలో అలజడి రేపుతున్నారు. అక్కడ వైసీపీలో వర్గ విభేదాలున్నా ఎన్నికలనాటికి సమసిపోతాయనే భావన అందరిలో ఉంది. ఇప్పుడు హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో బాలయ్య గొంతు సవరించడంతో వైసీపీ నుంచి కూడా రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా హిజ్రాలతో ఫిర్యాదు చేయించి బాలయ్యకు మరో సవాల్ విసిరారు వైసీపీ నేతలు. సొంత నియోజకవర్గంలోనే ఆయనకు కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  Last Updated: 28 Sep 2022, 05:59 PM IST