Site icon HashtagU Telugu

Hijab Row: ప్ర‌కాశం జిల్లాలో హిజ‌బ్ ర‌గ‌డ‌

Hijab Prakasam

Hijab Prakasam

హిజాబ్ వివాదం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నసంగ‌తి తెలిసిందే. తొలుత క‌ర్నాట‌క‌లో మొద‌లైన ఈ హిజ‌బ్ ర‌గ‌డ‌, ఆ త‌ర్వాత ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా పాకుతుంది. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కూడా ఈ హిజాబ్ వివాదం ట‌చ్ చేసింది. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లోని ల‌యోలా కాలేజీలో హిజ‌బ్ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. రోజూ హిజాబ్ ధ‌రించి కాలేజ్‌కి వ‌స్తున్న కొంద‌రు ముస్లిం విద్యార్ధినుల‌ను, ఈరోజు కూడా హిజాబ్ ధ‌రించి పాఘ‌శాల‌కు వెళ్ళారు.

అయితే బుర్ఖా తీసి కాలేజ్ లోప‌లికి రావాల‌ని, స్కూల్ ప్ర‌తినిధులు చెప్ప‌డంతో త‌లెత్తిన ఈ హిజాబ్ వివాదం, వెంట‌నే స‌ద్దుమ‌ణ‌గ‌డం, విద్యార్ధినుల‌ను క‌ళాశాల‌లోకి ఆహ్వానిచ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఏపీలో హిజాబ్ వివాదం చెల‌రేగింది. ప్ర‌కాశం జిల్లాలోని య‌ర్ర‌గొండెపాలెంలోని వికాస్ హైస్కూల్ యాజ‌మాన్యం ముస్లిం విద్యార్ధినుల‌ను బుర్ఖా తొల‌గించి స్కూల్‌కి రావాల‌ని చెప్ప‌డంతో రాష్ట్రంలో మ‌రోసారి హిజ‌బ్ వివాదం చెల‌రేగింది.

ఈ క్ర‌మంలో ఆ విద్యార్ధినులు వారి త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డం, వారు వెళ్ళి ముస్లిం మ‌త‌పెద్ద‌ల‌కు తెలప‌డంతో, వికాస్ హైస్కూల్ వ‌ద్ద ముస్లిం పెద్ద‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో ప్పట్నుంచో హిజాబ్ ధరించే పాఠ‌శాల‌కు వ‌స్తున్న ముస్లిం పిల్ల‌ల్ని, ఇప్పుడు కొత్త‌గా హిజాబ్ తీసి రావాల‌ని చెప్ప‌డం ఏంట‌ని, ఆ స్కూలు యాజ‌మాన్యం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్కూల్ యాజ‌మాన్యానికి వ్య‌తిరేకంగా ముస్లిం మ‌త‌పెద్ద‌లు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో అక్క‌డ స్కూల్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డ్డా, వికాస్ స్కూల్ యాజమాన్యం దిగిరావడంతో సమస్య సద్దు మణిగింది.

ఇక హిజాబ్‌ వివాదంతో కర్నాటక రాష్ట్రం రగిలిపోతోంది. రెండు వ‌ర్గాల మ‌ధ్య దాడులు ప్రతిదారులతో క‌న్న‌డ రాష్ట్రం అట్టుడుకుతోంది. సోమ‌వారం రాత్రి శివమొగ్గలో భజరంగ్‌దళ్ యువ‌ కార్యకర్త హర్ష హత్యతో అక్క‌డ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్ర‌మంలో శివమొగ్గ ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హర్ష హత్యకు ప్రతీకారంగా భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళ‌న‌కు దిగ‌డంతో, రెండు వ‌ర్గాల మ‌ధ్య పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఇరు వ‌ర్గాల వారు క‌త్తుల‌తో రోడ్ల మీద‌కు రావ‌డం అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అక్క‌డి యువ‌కులు భారీ సంఖ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి వాహ‌నాల‌ను త‌గల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. ప్రార్థ‌నా స్థ‌లాల‌కు నిప్పు పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన యువ‌కులు రాళ్ళు, క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకున్నారు. మ‌రోవైపు అక్క‌డ పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించినా ఘ‌ర్ష‌ణ‌ల‌ను అదుపుచేయ‌లేక‌పోతున్నారు. హర్ష దారుణ‌ హత్య ఘటనతో అక్క‌డి పరిస్థితులు అదుపుతప్ప‌డంతో, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. బహిరంగంగా గుమ్మిగూడటాన్ని, ర్యాలీలు, సభలను నిషేధించారు. ఏది ఏమైనా రోజురోజుకీ అన్ని రాష్ట్రాల‌కు పాకుతున్న‌ హిజాబ్ వివాదం దేశాన్ని కుదిపేయ‌డం ఖాయ‌మ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.