రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడిపి (TDP) పార్టీదే విజయమని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు (YCP), నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ వైసీపీ కి పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ చెప్పిన ఐడియా లతో , ప్రచారం తో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి ప్రశాంత్ ఇండైరెక్ట్ గా టీడీపీ కి పనిచేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ ను బాగా నమ్ముతారు.
ఎన్నికల వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతల చూపంతా ఆయన వైపే. ఆయన ఎవరి పక్షం ఉంటారో విజయం వారిదే. ఇప్పటికే జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఆయన్ను నమ్మిన వారంతా గెలుపు బాటలో పయనించారు. మొత్తంగా ఆయన చెప్పిందే వేదం అని ఒక్క మాటలో చెప్పొచ్చు. అలాంటి ప్రశాంత్ ఇప్పుడు టీడీపీ గెలవబోతుందని చెప్పేసరికి వైసీపీ శ్రేణుల్లో భయం పట్టుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ లో అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల స్థాన చలనం, అభ్యర్థుల మార్పిడి, ఎంపీలు, ఎమ్మెల్యేల వలసలతో వైసీపీ విజయావకాశాలు సన్నగిల్లుతుండగా ..ఇక ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ఆ పార్టీ కొంపముంచుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని, ఓటమి తప్పదని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో టీడీపీ – జనసేన (TDP-Jansena)కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. పీకే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యి..పీకే వ్యాఖ్యలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికి ఇప్పటికే ప్రజల్లో వైసీపీ గెలుపు కష్టమే అని ఫిక్స్ అవుతుండగా..ఇప్పుడు పీకే చేసిన కామెంట్స్ ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా అయ్యింది.
Read Also : vijayasai reddy: ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవుః విజయసాయి రెడ్డి