Site icon HashtagU Telugu

High Tension : తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం

High Tension In Tadipatri

High Tension In Tadipatri

ఏపీలో పోలింగ్ పూర్తియినప్పటికీ వైసీపీ – టీడీపీ (YCP Vs TDP) శ్రేణుల మధ్య దాడులు ఆగడం లేదు. వరుస ఉద్రిక్త ఘటన లతో వణికిపోతుంది. ఎక్కడ ఏంజరుగుతుందో..? ఎవరిపై ఎవరు దాడి చేస్తారో..? ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఈరోజు సాయంత్రం నుండి వరుస దాడులు జరుగుతున్నాయి. కొద్దీ సేపటి క్రితం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఫై హత్యాయత్న ఘటన మరచిపోకముందే..అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri )లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడటంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ వందలాది మంది కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఏ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణకు గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణతో తాడిపత్రి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

ఇటు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో వెళుతున్న పులివర్తి నాని వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు. తనపై దాడి జరగటంతో మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే పులివర్తి నాని బైఠాయించి నిరసన తెలిపారు. పులివర్తి నానిపై దాడి జరగడంతో టిడిపి శ్రేణులు అలర్ట్ అయ్యారు.

Read Also :