CBN Kuppam Tour : వైసీపీ వాళ్ల ఇళ్ల‌కొచ్చి కొడ్తాం: జ‌గ‌న్, డీజీపీకి చంద్ర‌బాబు స‌వాల్

మునుపెన్న‌డూ లేని విధంగా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు జ‌గ‌న్ , ఏపీ డీజీపీపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటోన్న వైసీపీ శ్రేణుల‌కు పోటీగా కుప్పం టీడీపీ క్యాడ‌ర్ పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చింది. బ‌స్తాండ్ వ‌ద్ద టీడీపీ నిర్వ‌హిస్తోన్ అన్న క్యాంటిన్ ను వైసీపీ ధ్వంసం చేయ‌డంతో చంద్రబాబు ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

  • Written By:
  • Updated On - August 25, 2022 / 01:16 PM IST

మునుపెన్న‌డూ లేని విధంగా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు జ‌గ‌న్ , ఏపీ డీజీపీపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటోన్న వైసీపీ శ్రేణుల‌కు పోటీగా కుప్పం టీడీపీ క్యాడ‌ర్ పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చింది. బ‌స్తాండ్ వ‌ద్ద టీడీపీ నిర్వ‌హిస్తోన్ అన్న క్యాంటిన్ ను వైసీపీ ధ్వంసం చేయ‌డంతో చంద్రబాబు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. కూల్చేసిన అన్న క్యాంటిన్ వ‌ద్ద రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేసిన త‌రువాత ఆయ‌న మాట్లాడారు. వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన క్యాడ‌ర్ మ‌ధ్య నుంచి జ‌గ‌న్ కు ఛాలెంజ్ విసిరారు. మ‌గాళ్లైతే, ద‌మ్ముంటే ఇప్పుడు రండి తేల్చుకుందామంటూ చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఊగిపోతూ స‌వాల్ విసర‌డం క్యాడ‌ర్ కేరింతలు కొట్టారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయాలని వాళ్ల‌కు ఎలా అనిపించిందని మండిపడ్డారు. వాళ్ల మొఖాన‌ ఉమ్మేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టరు, పెట్టేవాళ్లను పెట్టనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్నారు. జగన్ రెడ్డి చేతిలో పోలీసులు కీలు బొమ్మగా మారారని మండిపడ్డారు. కుప్పం చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు. ఇలాంటి దారుణాలు కుప్పంలో గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. గూండాలు, రౌడీలను అణచి వేసిన చరిత్ర టీడీపీదని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వీధికొక రౌడీని తయారు చేసిందని ఫైర్ అయ్యారు. రౌడీలను మంత్రులను చేసిన ఘనత జగన్ దని ఆగ్రహించారు. ఇకపై టీడీపీ వాళ్లపై దాడులు చేస్తే నేరుగా వాళ్లింటికి వస్తానని హెచ్చరించారు. ఇంటికొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తాను బతికున్నంత వరకు ఏమీ చేయలేరని చెప్పారు. ధర్మపోరాటాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తున్నానని చెప్పారు. జగన్ పాలనపై రాష్ట వ్యాప్తంగా వ్యతిరేకత, తిరుగుబాటు మొదలయిందని అన్నారు.

బాబు ప‌ర్య‌ట‌న హైలెట్స్

*చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వైసిపి నేతలు, కార్యకర్తలు. వైసిపి కార్యకర్తల చర్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

*పాదయాత్రగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అన్న క్యాంటీన్ కు వచ్చిన టిడిపి అధినేత, అన్న క్యాంటీన్ పై వైసిపి నేతల దాడిని వివరించిన స్థానిక టిడిపి నేతలు

*వైసిపి నేతల చర్యలకు నిరసనగా అన్న క్యాంటీన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన టిడిపి అధినేత

ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక చీకటి రోజు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చెయ్యడం నీచం. వీధి కొక రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారు.
* పోలీసులు సరిగా ఉండి ఉంటే అన్న క్యాంటీన్ ను ఇలా ద్వంసం చేసేవారా. ఎస్పీ ఎక్కడ ఉన్నాడు…..ఏం చేస్తున్నాడు. మా వాళ్లు కూడా దాడులకు దిగితే ఏం చేస్తారు. మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా దాడి చేశారు….మరి పోలీసులు ఏం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా….పోలీసులు ఉంది మాపై దాడులు చెయ్యడానికా?
*అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకువెళతారా? మూడేళ్లుగా జరుగుతున్న గ్రానైట్ అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నాం…..బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నాం. మూడేళ్లలో అనేక చోట్ల నా పర్యటనలకు అడ్డంకులు సృష్టించారు. కోర్టు కూడా చీవాట్లు పెట్టింది. అప్పుడే పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది…మా ఇంటికి వచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి జగన్ మంత్రులను చేశాడు.
*దాడులు చేసి భయపెట్టి గెలవాలి అనుకుంటున్నారు..ఇలాంటి దాడులకు టిడిపి భయపడేది లేదు. పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తను ప్రజలకు, మీడియాకు చూపించి ప్రశ్నించిన టిడిపి అధినేత‌. వైసిపి, పోలీసులపై న్యాయ పరంగా పోరాడుతా…రాజకీయంగా కూడా పోరాడుతా. కొందరు పోలీసులు కంటే బ్రిటిష్ వాళ్లే నయం అనిపించింది. వాళ్ల ప్రవర్తన అలా ఉంది.
*ప్రజలు మౌనంగా ఉంటే వారి ఇంటి వరకు రౌడీలు వస్తారు. చైతన్య వంతంగా ఉండి పోరాడాలి. వైసిపి పతనం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కుప్పం నుంచి ధర్మపోరాటానికి నాంది. కుప్పంలో నేడు సిగ్గు లేకుండా ఆర్టిసి బస్సులు నిలిపివేశారు…స్కూళ్లు మూసి వేశారు. ఏంటి ఇవన్నీ?
* నా శైలికి భిన్నంగా ఇకపై కఠినం గా వెళ్లాల్సిన అవసరం ఉంది…అందుకే ఇలా మట్లాడాల్సి వస్తుంది. ఎక్కువ కాలం మా కార్యకర్తలను కట్టడి చెయ్యడం కూడా సాధ్యం కాదు.
*వైసిపి వాళ్లు కూల్చిన దగ్గరే అన్న క్యాంటీన్ లో భోజనం పెడుతున్నా ఈ సారి మాపై దాడి జరిగితే….వాళ్ల ఇంటికి వెళ్లి కొడతాం. అన్నం పెట్టే వాడిపై చెయ్యి చేసుకోవడం నీచం…కన్నతల్లిపై దాడి చేసినట్లే. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై దాడిని తీవ్రంగా తీసుకుంటున్నాం. అన్న క్యాంటీన్ ఇక్కడే కొనసాగుతుంది.