Andhra Pradesh : ఏపీలో మండుతున్న ఎండ‌లు.. కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ జిల్లాల్లో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు

ఏపీలో ఎండ‌లు మండిపోతున్నాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 41.83 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు అయింది. కోస్తాంధ్ర,

Published By: HashtagU Telugu Desk
Heatwave

Heatwave

ఏపీలో ఎండ‌లు మండిపోతున్నాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 41.83 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు అయింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు న‌మోదువుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని వాతావరణ నివేదికలు వెల్లడించడం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏపీలో ఎండ వేడిమి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. అత్యధికంగా విజయనగరం జిల్లా గుర్లలో 41.83 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  నంద్యాలలోని ఆత్మకూరులో 41.7 డిగ్రీలు, ఏలూరు జిల్లా పూళ్ల వద్ద 41.11, బాపట్లలో 41,6, ప్రకాశం జిల్లా గోస్పాడులో 41.8, జంగారెడ్డిగూడెంలో 41.65, అనకాపల్లిలో 41.62, నెల్లూరులో 41.4, నంద్యాలలో 41.2, శ్రీ సత్యసాయి జిల్లాలో 41.29, అనంతపురంలో 41.03, మన్యం జిల్లా భామినిలో 40.93, విజయవాడలో 38.1, తిరుపతిలో 40.7, కడపలో 40.7, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో 40.61 డిగ్రీలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 40.6, అల్లూరి జిల్లా కూనవరంలో 40.31, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 40.01, ఒంగోలులో 39.8, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 39.7, విశాఖలో 39.3, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 39.24, శ్రీకాకుళంలో 37.7, కాకినాడలో 37.2, కర్నూలులో 38.74, రాయచోటిలో 38.12 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  Last Updated: 12 Apr 2023, 08:42 AM IST