Pinnelli : మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లి కి హైకోర్టు ఆదేశాలు

ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 08:31 PM IST

ఈవీఎం ను ధ్వసం చేసిన ఘటన లో మాచర్ల ఎమ్మెల్యే (Macherla YCP MLA ) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల 6 వరకు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్​ కేంద్రానికి వెళ్లడానికి ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే హైకోర్టు అనుమతించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు తేల్చిచెప్పింది. సాక్షులతో మాట్లాడేందుకు కూడా వీల్లేదని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించగా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు పిన్నెల్లి. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పిన్నెల్లి సహా పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌పైనా ఆదేశాలిచ్చింది.

అసలు ఏమిజరిగిందంటే.. రామకృష్ణారెడ్డి పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రం 202లోని బూత్‌లోకి అనుచరులతో కలిసి వెళ్లారు. అలా వెళ్లటం నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ పోలీసులు ఎక్కడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బూత్‌లోని ఈవీఎంను బయటకు నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సిట్‌ విచారణతో ఈ వ్యవహారం బహిర్గతం కాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 4 సార్లు ఎమ్మెల్యే, సహాయమంత్రి హోదా కలిగిన విప్‌ పదవిలో ఉన్న పిన్నెల్లి ఇలా వీధిరౌడీలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. అల్లర్లు, దాడులకు పెట్టిన పేరైన మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల విధ్వంసాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్, బ్యాలట్ల ధ్వంసం వంటివి అధికార పార్టీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇదే విషయాన్ని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సైతం గుర్తుచేస్తున్నారు.

Read Also : Sweat : చెమటలు పట్టాలి.. చెమట పట్టడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా?