Site icon HashtagU Telugu

Chandrababu : ఎన్నికల సమయంలో చంద్రబాబుకు భారీ ఊరట..

Chandrababu Big Relief

Chandrababu Big Relief

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు ఏపీ హైకోర్టు (AP Hicourt) భారీ ఊరట కల్పించింది. లిక్కర్, IRR, ఇసుక స్కాం కేసుల్లో చంద్రబాబు కు ముందస్తు బెయిల్ ను ప్రకటించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR, మద్యం, ఉచిత ఇసుక కేసులలో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక కేసుల గురించి మీడియా ముందు మాట్లాడొద్దని బాబును ఆదేశించింది కోర్ట్. మరోపక్క స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మొదట మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్ కూడా మంజూరు చేసింది. మొత్తం మీద ఎన్నికల సమయంలో బాబు కు సంబంధించి వరుస గుడ్ న్యూస్ లు వస్తుండడం తో టీడీపీ శ్రేణుల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. మరోపక్క వైసీపీ నుండి కూడా పెద్ద ఎత్తున నేతలు టీడీపీ లో చేరుతుండడంతో గెలుపు ధీమా మరింత ఎక్కువ అవుతుంది.

Read Also : KA Paul : KA పాల్ దగ్గర పవన్ సీఎం అయ్యే ప్లాన్..!!