Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్’గా నియమించారనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. మార్చి 8న ఏపీ సర్కారు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలు జరగనున్నాయని, ఆ సందర్భంగా మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తారనే టాక్ వినిపించింది. అయితే అదంతా అబద్ధమని తేలింది. మీనాక్షి చౌదరికి ఆ పదవిని ఇచ్చే అంశంపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఏపీ అధికారులు వెల్లడించారు. మీనాక్షిని ఏపీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించామన్న వార్తల్లో నిజంలేదని తేల్చి చెప్పారు. మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక నటిని నియమించాలని ఏపీ సర్కారు తొలుత భావించిన మాట నిజమేనట. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Also Read :Himani Narwal: సూట్‌కేసులో కాంగ్రెస్ కార్యకర్త డెడ్‌బాడీ.. హిమానీ నార్వాల్ ఎవరు ?
మీనాక్షి చౌదరి ఎవరు ? కెరీర్ ప్రస్థానమేంటి ?
- మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హర్యానాలోని పంచ్‌కుల గ్రామంలో జన్మించారు.
- మీనాక్షి తండ్రి ఆర్మీ ఆఫీసర్.
- చిన్నప్పటి నుంచి ఆమెకు చదువంటే ప్రాణం. డెంటల్ కోర్సును మీనాక్షి పూర్తి చేశారు.
- పంచ్‌కుల గ్రామం నుంచి మొదటి డాక్టర్, మొదటి యాక్టర్ మీనాక్షి చౌదరీయే.
- 2017లో ప్రపంచ సుందరి ‘మానుషి చిల్లర్’ను చూసి మీనాక్షి స్ఫూర్తి పొందింది.
- 2018లో ‘మిస్ గ్రాండ్ ఇంటర్‌నేషనల్’ పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.
- 2018లో ‘ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా హర్యానా’ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
- ‘మిస్ ఇండియా’ టైటిల్‌నూ మీనాక్షి గెల్చుకుంది.
- మీనాక్షికి స్విమ్మింగ్ చేయడం అంటే ఇష్టం.
- హర్యానాలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పోటీల్లో మీనాక్షి పాల్గొన్నారు.
- హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘అవుట్ ఆఫ్ లవ్’లో మీనాక్షి నటించారు. త్వరలో విడుదలవుతోన్న ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ వంటి తెలుగు సినిమాల్లోనూ మీనాక్షి నటిస్తున్నారు.
- గతేడాది రిలీజ్ అయిన గుంటూరు కారం, లక్కీ భాస్కర్ సినిమాలల్లో మీనాక్షి నటించారు.
- ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఈ ఏడాది విడుదలైంది.
- ప్రస్తుతం అనగనగా ఒకరోజు, విశ్వంభర సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.