Site icon HashtagU Telugu

Elections Effect : కిటకిటలాడుతున్న ఎయిర్ పోర్టులు

Heavy Rush In Airports

Heavy Rush In Airports

Elections ఎఫెక్ట్ తో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లే కాదు ఎయిర్ పోర్ట్ లు సైతం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ వాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు తరలివస్తున్నారు. మాములుగా సంక్రాంతి పండగ వస్తే తప్ప ఏపీ వాసులు ఇల్లు వదిలి కదిలారు..కానీ ఈసారి ఎన్నికల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా సొంతర్లకు వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం..మరోపక్క వీకెండ్ కావడంతో రెండు రోజుల ముందే ఇళ్లకు చేరుకుంటారు. ఇక బస్టాండ్ లు , రైల్వే స్టేషన్ లు మాత్రమే కాదు ఎయిర్ పోర్ట్స్ సైతం సందడి గా మారాయి. విదేశాల నుంచి ఎక్కువగా భారత్ కు వచ్చే వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అన్ని దేశాల్లో టీడీపీ, వైసీపీలకు అభిమానులున్నారు. సామాజికపరంగా కూడా ఈసారి ఎన్నిక ప్రభావం చూపనుండటంతో వారంతా భారత కు క్యూ కట్టారు. ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లు కిటకిటలాడుతున్నాయి.

మరోపక్క వైసీపీ , టీడీపీ పార్టీల అభ్యర్థులు..తమ తమ నియోజవర్గంలో ఓటు హక్కు ఉన్న వారికీ ఫోన్లు చేసి వారు ఎక్కడ ఉన్న సరే వచ్చి ఓటు వేయాలని , ప్రయాణ ఖర్చులతో పాటు మరికొంత డబ్బు కూడా ఇస్తామని చెపుతుండడంతో వారంతా ఫ్రీగా వెళ్లి ఓటు వేయడమే కదా అని చెప్పి ట్రైన్ , బస్సు లలో టికెట్స్ లేకపోతే విమానంలో వస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టి లో పెట్టుకొని ఆర్టీసీ సైతం పెద్ద మొత్తం లో బస్సులను సిద్ధం చేస్తుంది. ఇక ప్రవైట్ ట్రావెల్స్ సైతం భారీగా టికెట్ ధరలను పెంచి ఎన్నికలను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈసారి ఏపీలో ఎన్నికల సందడి గట్టిగా ఉండబోతుంది.

Read Also : Pithapuram Politics : పవన్ కళ్యాణ్‌కు భారీ మెజారిటీ పక్కా అంటున్న పిఠాపురం పోల్ సర్వేలు