Site icon HashtagU Telugu

Rain Alert : రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వ‌ర్షాలు – ఐఎండీ

Weather Update

Hyd Rains Imresizer

రానున్న రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంపై తుపానుగా మారనుంది. ఇది మరో రెండు రోజుల పాటు తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు ఇదే దిశలో కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ప్రారంభమవుతాయిద. క్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. సోమవారం, మంగళవారం. ఉత్తర కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 23వ తేదీ వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గంటకు 65 కి.మీ వేగంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు స‌ముద్రంలో చేప‌లు ప‌ట్ట‌డం కోసం వెళ్లవద్దని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.