Site icon HashtagU Telugu

Flights Cancelled: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 23 విమానాలు రద్దు

Refund Rules

Refund Rules

Flights Cancelled: మిచౌంగ్ తుపాను ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. ఈమేరకు విశాఖ నుంచి 23 విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విమానాశ్రయం పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తెలిపారు. అంతేకాదు.. తిరుపతికి చెందిన విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి.

ఏపీలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సాపురం, మొగల్తూరు రెండు మండలాల్లో 12 తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. దీంతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భీమవరం కలెక్టర్ కార్యాలయంలో ‘మిచౌంగ్’ తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అయ్యింది. అత్యవస సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అధికారులు. వర్షం ఎఫెక్ట్ తో ఎన్ డి ఆర్ ఎఫ్ , ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉన్నాయి.

Also Read: Congress MLAs: మంత్రి పదవీ ప్లీజ్.. క్యాబినెట్ పోస్టులపై టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాబీయింగ్!