Godavari Floods : ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి న‌ది.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న ఏపీ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్

Published By: HashtagU Telugu Desk
Floods Imresizer

Floods Imresizer

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. ఎప్ప‌టిక‌ప్పుడు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభావిత జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించింది. ముందస్తు సహాయక చర్యల కోసం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) నుండి రెండు బృందాలు అల్లూరికి, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) నుండి రెండు బృందాలు ఏలూరుకు పంపించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌ల‌కు ఈ నెంబ‌ర్లు ద్వారా 1070 మరియు 18004250101 సంప్రదించాలని APSDMA ప్రజలకు సూచించింది. జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద నీటిలో ఈత, చేపల వేటకు వెళ్లవద్దని, నదిలో పడవలు, మోటర్‌బోట్లు, స్టీమర్‌లలో ప్రయాణించడం మానుకోవాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజలకు సూచించారు.

  Last Updated: 20 Jul 2023, 03:21 PM IST