Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ తూఫాన్ హెచ్చరిక..

అల్పపీడనం కారణంగా రాగాల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 11:10 AM IST

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ తూఫాన్ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగాల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది. గురువారం ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నెల 25న రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ కు రీమల్ గా నామకరణం చేసారు. దీంతో..నాలుగు రోజులు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చిరిక జారీ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం (మే 24) కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. శనివారం (మే 25) మెదక్, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని, ఆదివారం కూడా మెదక్, సంగారెడ్డి, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also : China Vs Taiwan : తైవాన్‌ను చుట్టుముట్టి.. చైనా మిలిటరీ డ్రిల్స్