Heat Waves In Telugu States : వామ్మో..47. 7 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..బయటకు వెళ్తే అంతే సంగతి

40 డిగ్రీలు దాటితేనే అల్లాడిపోయే మనం..ఈరోజు ఏకంగా 47. 7 డిగ్రీలకు చేరింది

Published By: HashtagU Telugu Desk
Heatwave In Telugu States

Heatwave In Telugu States

వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఒక్క సెకన్ కూడా బయట ఉండలేకపోతున్నాం..అలానీ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం.. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్న మాట ఇదే.. 40 డిగ్రీలు దాటితేనే అల్లాడిపోయే మనం..ఈరోజు ఏకంగా 47. 7 డిగ్రీలకు చేరింది..మరో రెండు రోజులు పోతే 50 డిగ్రీలకు చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఎండకు నిప్పుల కుంపటి అనే మాట కూడా తక్కువే..ఆ రేంజ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు ఏమైనా భూమికి అతి దగ్గరకు వచ్చాడా..అన్న రేంజ్లో మూడు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు వడగాల్పులు విపరీతంగా పెరిగాయి. ఈ ఎండకు జనం అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని వాతావరణశాఖ చెపుతుంది. అత్యవసరమైతే తప్ప.. అస్సలు బయటికి రావొద్దని .. వృద్ధులు, చిన్నారులైతే మరింత జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.ఈ ఎండలకు వృద్దులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. ఎండదెబ్బ తగలకుండా క్యాప్, గొడుగు, టవల్‌లో ఏదో ఒక దానితో మీ తలను కవర్ చేసుకోండి. కాటన్‌ డ్రెస్సెస్‌ వేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. వృద్ధులు, ప్రెగ్నెంట్ లెడీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుండి అని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

Read Also : Double Ismart : హమ్మయ్యా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలైందిలే.. ఈసారైనా కంప్లీట్ అవుతుందా..?

  Last Updated: 04 May 2024, 01:16 PM IST