Site icon HashtagU Telugu

Govt Medival Colleges : ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల పురోగ‌తిపై మంత్రి విడ‌ద‌ల ర‌జిని స‌మీక్ష.. మార్చి నెలాఖ‌రుక‌ల్లా..!

Health minister AP

Health minister AP

ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ లో ఉన్న‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల పురోగ‌తిపై రాష్ట్ర మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి రాష్ట్రంలో కొత్త‌గా ఐదు ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను ప్రారంభించాల‌నే దృఢ నిశ్చ‌యంతో ప్ర‌భుత్వం ముందుకు వెళుతోంద‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి మ‌చిలీప‌ట్ట‌ణం, ఏలూరు, విజ‌య‌న‌గ‌రం, నంద్యాల‌, రాజ‌మండ్రిల‌లో ఖ‌చ్చితంగా వైద్య క‌ళాశాల‌లు ప్రారంభం కావాల‌ని తెలిపారు. జాతీయ వైద్య మండ‌లి నిబంధ‌న‌ల మేర‌కు ఈ ఐదు క‌ళాశాల‌ల్లో కావాల్సిన అన్ని వ‌స‌తులను వ‌చ్చే నెలాఖ‌రులోగా స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు.

ఈ ఐదు క‌ళాశాల‌ల‌కు సంబంధించి అవ‌స‌ర‌మైన సిబ్బంది నియామకాలు మొత్తం వెంట‌నే పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మ‌రో 30 శాతం లోపు మాత్ర‌మే ఆయా చోట్ల సిబ్బంది అవ‌స‌రం ఉంద‌ని, వెంట‌నే ఆ ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేయాల‌న్నారు. సివిల్ వర్కులు మొత్తం మార్చిలోగా పూర్తి చేయాల‌ని ఏపీఎంఎస్ ఐడీసీ అధికారుల‌ను ఆదేశించారు. ఇక‌పై ప్ర‌తి రోజూ ఈ ఐదు క‌ళాశాల‌ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. తాను కూడా నిరంత‌రం పనుల పురోగ‌తిపై స‌మీక్ష చేస్తాన‌న్నారు. నూత‌న క‌ళాశాల‌ల‌కు సంబంధించి లైబ్రరీల నిర్మాణం, వాటి కావాల్సిన ఫ‌ర్మిచ‌ర్‌, పుస్త‌కాలు, క‌ళాశాల‌ల‌కు కావాల్సిన వైద్య ప‌రిక‌రాలు, వాటి కొనుగోలు… ఇలా ప్ర‌తి అంశంపై మంత్రి ఆరా తీశారు. వెంట‌నే ఆయా వ‌స‌తులన్నీ ఏర్పాటుచేసుకోవాల‌ని చెప్పారు. నిధుల స‌మ‌స్య ఎక్క‌డా లేద‌ని, వెంట‌నే కావాల్సినవ‌న్నీ కొనుగోలు చేయాల‌ని ఆదేశించారు. ఎన్ ఎం సీ నిబంధ‌న‌లకనుగుణంగా ప్ర‌తి అంశం ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.