Raghu Rama Krishna Raju: ఉండి(undi) అసెంబ్లీ టీడీపీ(tdp) టికెట్ తనదేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తన టికెట్ విషయంలో 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅమిరంలో ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉండి టీడీపీ టికెట్ ను చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో, ఇద్దరి మధ్యలో టికెట్ రఘురాజుకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Also:Team India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ఇదేనా..?
రామరాజుకు టికెట్ క్యాన్సిల్ చేసి… రఘురాజుకు చంద్రబాబు టికెట్ ఇవ్వబోతున్నారని చెపుతున్నారు. ఆ ధీమాతోనే రఘురాజు ఉండి నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. రామరాజును బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. రఘురాజు బరిలో ఉంటే శివరామరాజు శాంతిస్తారని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు చెపుతున్నాయి. ఈ క్రమంలో, రామరాజును కూడా ఒప్పిస్తే రఘురాజుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే.