Site icon HashtagU Telugu

AP Govt : విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

Ap Govt

Ap Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) విశాఖపట్నం(Vizag)లో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్ సంస్థ (Hayagriva Farm and Developer Company)కు కేటాయించిన 12.41 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ భూ కేటాయింపును రద్దు చేయాలని అధికారిక ఉత్తర్వులను సీసీఎన్ఏ (CCNA) జారీ చేసింది. భూమి కేటాయింపు ఒప్పందాన్ని సమీక్షించిన ప్రభుత్వం, సంస్థ తగిన ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

Fact Check : ర్యాగింగ్‌కు పాల్పడితే ఇక మరణశిక్షే.. నిజం తెలుసుకోండి

ఇక, విశాఖపట్నంలోనే కాకుండా, అమరావతిలోనూ వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తోంది. ఈ క్రమంలో, మొత్తం 13 ప్రైవేట్ కంపెనీలకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములను రద్దు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అక్రమ భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.

Bhupesh Baghel : మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్

ఈ చర్యలపై రాజకీయంగా పెద్ద చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు దీన్ని వ్యాపార వర్గాలపై ఒత్తిడి తేవడమని ఆరోపిస్తున్నారు. అయితే, భూములను తగిన ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో మరిన్ని భూ కేటాయింపులపై సమీక్షలు జరిగే అవకాశముండగా, ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి నిలిచింది.