Site icon HashtagU Telugu

Liquor Scam : భారీ లిక్కర్ స్కాం.. మద్యం ముడుపులకు హవాలా నెట్‌వర్క్‌.. సంచలన కథనం

Liquor Scam

Liquor Scam

Liquor Scam : గత వైఎస్సార్ సీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ మీడియాలో సంచలన కథనం ప్రచురితమైంది.  అప్పట్లో నెలకు రూ.60 కోట్లు చొప్పున నాలుగేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్లను కొల్లగొట్టారని ఆ కథనంలో ప్రస్తావించారు. లిక్కర్ సప్లై చేసే కంపెనీలతో చర్చలు జరపటం, అడిగినన్ని ముడుపులిచ్చే సంస్థలకు సప్లై ఆర్డర్లు అప్పగించడం, వాటి నుంచి వసూలు చేసిన ముడుపులను ‘బిగ్‌బాస్‌’కు చేర్చడంలో ‘పెద్ద’రెడ్డి కొడుకు కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు.

Also Read :Thandel : తండేల్ సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్..!

మద్యానికి బేసిక్‌ ప్రైస్‌‌ను బాగా పెంచి..

చిత్తూరు జిల్లాకు చెందిన ‘పెద్ద’రెడ్డి(Liquor Scam) అనే వ్యక్తి వైఎస్సార్ సీపీలో నంబర్‌-2గా చలామణి అవుతున్నాడని కథనంలో ప్రస్తావించారు. అప్పట్లో ఐటీ శాఖ సలహాదారుడిగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్‌ కసిరెడ్డి)ని ముందుపెట్టి భారీ హవాలా నెట్‌వర్క్‌‌ను నడిపినట్లు పేర్కొన్నారు. దీనిపై ఇటీవలే ఏపీ సీఐడీ అధికారులు ఆధారాలను సేకరించారని తెలిపారు. లిక్కర్ సప్లై సంస్థల నుంచి కొన్న మద్యానికి బేసిక్‌ ప్రైస్‌‌ను బాగా పెంచి, లాభాలు పొందినట్లు తేల్చారు.

Also Read :Priyanka Chopra : ప్రియాంక చోప్రాపై ఆ వార్తలు నిజమేనా..?

కేవలం వాటికే రూ.2,701 కోట్ల ఆర్డర్లు

‘పెద్ద’రెడ్డి కుమారుడు పలు డిస్టిలరీల్లో పాగా వేసి పలు బ్రాండ్ల మద్యం తయారు చేయించి, వాటికే అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నట్లు పేర్కొన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ గెల్చిన వెంటనే నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా ఆయన గుప్పిట్లోకి తెచ్చుకున్నారని గుర్తించారు. ఆయా డిస్టిలరీలకు రూ.2,701 కోట్లు విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  సంస్థ మాజీ వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్‌రెడ్డి బినామీ కంపెనీ అనే టాక్ ఉంది. ఈ కంపెనీకి సొంత డిస్టిలరీ లేదు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజు పేరిట, అక్కడ ఉత్పత్తి చేసిన కొన్ని బ్రాండ్లను అదాన్ డిస్టిలరీస్ సప్లై చేసినట్లు సీఐడీ గుర్తించింది.

Exit mobile version