Jaya Prada Desire : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. బీజేపీ పెద్దల నిర్ణయమే ఫైనల్ : జయప్రద

Jaya Prada Desire : బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - April 4, 2024 / 08:07 AM IST

Jaya Prada Desire : బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో పాల్గొనాలనే కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని ఆమె చెప్పారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ అధిష్టానమే అని స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ఎలా చెబితే తాను అలా నడుచుకుంటానని తేల్చి చెప్పారు. జయప్రద తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల ఆలయాన్ని బుధవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని జయప్రద అన్నారు. ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని ఆమె చెప్పారు. ఏపీ పాలిటిక్స్‌పై తనకు ఆసక్తి ఉందన్నారు. ఇప్పటికే  ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించినందున, వచ్చే అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు. ఏపీలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు స్టార్ క్యాంపెయినర్‌గా ఉండాలని భావిస్తున్నట్లు  జయప్రద చెప్పారు. ‘‘ఎవరైతే ఏపీకి రాజధాని తీసుకు రాగలరో.. ఎవరైతే యువకులకు ఉద్యోగాలు ఇవ్వగలరో.. మహిళలకు రక్షణ కల్పించగలరో..  వారే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆమె(Jaya Prada Desire)  తెలిపారు. మూడో సారి దేశంలో మోడీ సర్కారు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తనకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అంటే చాలా ఇష్టమన్నారు. మోదీ, చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

ఏపీలో టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికలను బీజేపీ ఎదుర్కొంటోంది. ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం ఒప్పందంలో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో, జనసేన రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మే 13న ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

Also Read :Water Crisis Vs Elections : ఎన్నికల క్షేత్రంలో ‘జల జగడం’.. గ్రేటర్ హైదరాబాద్‌లో ‘త్రి’బుల్ ఫైట్

తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు ఏప్రిల్‌లో విశేష ప‌ర్వ‌దినాల గురించి తెలుసుకోవాలి. ఏప్రిల్ 5న శ్రీ అన్న‌మాచార్య వ‌ర్థంతి, ఏప్రిల్ 7న మాస‌శివ‌రాత్రి, ఏప్రిల్ 8న స‌ర్వ అమావాస్య‌, ఏప్రిల్ 9న శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 11న మ‌త్స్య‌జ‌యంతి, ఏప్రిల్ 17న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం, ఏప్రిల్ 18న శ్రీ‌రామప‌ట్టాభిషేక ఆస్థానం, ఏప్రిల్ 19న స‌ర్వ ఏకాద‌శి, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు జరగనున్నాయి.

Also Read :Health Tips: వట్టివేర్ల గురించి మీకు ఈ నిజాలు తెలుసా? ఎన్ని లాభాలో!