రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన స్పందించారు. బంధువులు చెప్తేనే తనకు విషయం తెలిసిందన్నారు. 15 ఏళ్ల కిందట రవి విశాఖ నుంచి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు.
ఇమ్మడి రవి .. ఈ పేరంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐబొమ్మ ఓనర్, బప్పమ్ టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవి అంటే అందరికీ తెలిసిపోతుంది. పైరసీ సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది ఐబొమ్మ . అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం.. బీఎస్సీ కంప్యూటర్స్ వరకూ చదివారు. ఇమ్మడి రవి తండ్రి పేరు అప్పారావు. బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి నేపథ్యంలో.. ఆయన తండ్రి అప్పారావు స్పందించారు. తనను అరెస్ట్ చేసిన సంగతి బంధువులు చెప్తే తెలిసిందన్నారు.
“15 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇలాంటి వెధవ పనులు చేస్తాడని అనుకోలేదు. డిగ్రీ వరకూ చదివించాను. ఆ తర్వాత తన బ్రతుకు తాను బతుకుతున్నాడని అనుకున్నా. ఆస్తులు ఎక్కువగా లేవు. అతని బతుకు అతనిది.. నా బతుకు నాది. నాకు వచ్చే పెన్షన్ డబ్బులతో బతుకున్నా. విశాఖ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏ దేశాలకు వెళ్లాడనేది తెలియదు. హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసు. కొన్ని రోజులకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకునేటప్పుడు చెప్పారు. అంత వరకే తెలుసు. రవి చేసింది వెధవ పని.. రవి చేసిన పనికి బాధపడటం తప్ప ఇంకేం చేయగలం.” అంటూ అప్పారావు తన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఇమ్మడి రవికి చట్టం ప్రకారం శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవికి విధించే శిక్షల గురించి అతని తండ్రి అప్పారావు స్పందించారు. ” మావాడు చేసిందే తప్పు. ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే.. వాళ్లు కళ్లు మూసుకుని ఉంటారా.. మావాడు చేసిన తప్పుకు చట్టం ప్రకారం రూల్స్ ఎలా ఉంటే అలా శిక్ష వేస్తారు.. నేను శిక్షించమని చెప్పను. వదిలేయమని కోరను. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ మా వద్దకు రాలేదు. రెండేళ్ల కిందట ఓసారి వచ్చాడంతే” అని అప్పారావు చెప్పారు. మరోవైపు తనకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే తాను బతుకుతున్నట్లు ఆయన చెప్తున్నారు.
మరోవైపు ఇమ్మడి రవి మీద ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు ఇమ్మడి రవి పైరసీ ద్వారా సినీ ఇండస్ట్రీకి నష్టం చేయడంతో పాటుగా.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నాడని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మొత్తం 65 మిర్రర్ వెబ్‌సైట్లను ఇమ్మడి రవి రూపొందించినట్లు తెలిపారు. 21 వేల సినిమాలు ఇమ్మడి రవి హార్డ్ డిస్కులో ఉన్నాయని.. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించాడన్నారు. అతని వద్ద 50 లక్షల మంది సమాచారం ఉందని వివరించారు.
