Elections 2024 : ఎవరో బటన్‌ నొక్కితే బతికే కర్మ మనకు లేదు..డైరెక్టర్ హరీష్ ట్వీట్

  • Written By:
  • Publish Date - May 13, 2024 / 10:26 AM IST

భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని సినీ , రాజకీయ ప్రముఖులతో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ..ఓటర్లలో ఓటు పాదాన్యం తెలియజేస్తుండగా..ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

‘రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులు కాదని.. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చుపెట్టిన నాయకున్ని గుర్తించాలని సూచించారు. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదంటూ వ్యాఖ్యానించారు. మన బటన్ మనమే నొక్కాలి అదే ఈరోజు ఈవీఎం బటన్ అవ్వాలి అని పిలుపునిచ్చారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా’ అని హరీష్ శంకర్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చూస్తే ఈయన ఎవరికీ సపోర్ట్ చేసారో అర్థమై పోతుంది.

ఏపీలో 175 అసెంబ్లీ , 25 లోక్ సభ స్థానాలకు సంబదించిన పోలింగ్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఇప్పటికే పార్టీల అధినేతలు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ స్టార్స్ సైతం సామాన్య ప్రజలతో కలిసి క్యూ లో నిల్చొని ఓటు వేయడం జరిగింది. ఓట్ వేసిన అనంతరం తమ సందేశాన్ని పంచుకుంటున్నారు.

Read Also :