Harirama Jogaiah : జగన్‌ను ఓడించాలంటే ఈ పని చేయండి అంటూ పవన్ కు హరి రామజోగయ్య లేఖ

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ (AP) ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు కుల సంఘాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఇప్పటికే ఆ పనిలో బిజీ గా ఉండగా..ఎప్పటికప్పుడు తన సలహాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు బహిరంగ లేఖలు రాయగా..తాజాగా మరోసారి లేఖ రాసారు. We’re now on WhatsApp. Click […]

Published By: HashtagU Telugu Desk
Harirama Jogaiah Wrote Lett

Harirama Jogaiah Wrote Lett

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ (AP) ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు కుల సంఘాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఇప్పటికే ఆ పనిలో బిజీ గా ఉండగా..ఎప్పటికప్పుడు తన సలహాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు బహిరంగ లేఖలు రాయగా..తాజాగా మరోసారి లేఖ రాసారు.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్‌ జగన్‌ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలనీ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన నిత్యవసరవస్తువుల ధరలు, ఇతర ఛార్జీల నుంచి ఉపసమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రెండువేలు అందేలా చూడాలని సూచించారు. ఒకరికంటే ఎక్కువ ఉన్నా.. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా అర్హత ఉన్నవారికి వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ.నాలుగు వేలు అందేలా చేయాలన్నారు. తెల్లకార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన విద్యార్ధిని, విద్యార్ధులకు ఎలక్ట్రికల్‌ స్కూటీలు ఉచితంగా అందించాలి.. విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలంటూ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Read Also : Raviteja : ఈగల్ వాయిదా.. ఆ డేట్ న సోలో రిలీజ్ ఛాన్స్..!

  Last Updated: 05 Jan 2024, 11:21 AM IST