Harirama Jogaiah : దేహీ అనడం పొత్తు ధర్మమా..? పవన్ కు హరి రామజోగయ్య లేఖ..

  • Written By:
  • Publish Date - February 25, 2024 / 04:05 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి తో పొత్తు పెట్టుకున్న దగ్గరినుండి పవన్ కళ్యాణ్ కు సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖలు రాస్తూ వస్తున్న హరి రామజోగయ్య..తాజాగా శనివారం ప్రకటించిన 24 సీట్ల విషయంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇప్పటికే కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు హరి రామజోగయ్య సైతం విమర్శలు చేయడం తో అందరిలో కలవరం మొదలైంది. ఈసారి కాపు వ్యక్తి సీఎం కాబోతున్నాడని..ఈసారి కాపులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాల్సిందే అని మొన్నటి వరకు మాట్లాడుకున్న కాపు సంఘాలు..ఇప్పుడు కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఓటమి తర్వాత కూడా పవన్ ప్రజల్లోకి వెళ్లడం..కౌలు రైతులను ఆదుకోవడం వంటివి చేస్తూ వస్తుండడం తో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎలాంటి పదవి , అధికారం లేనప్పుడే పవన్ ఇంత సాయం చేస్తూ వస్తున్నాడు..గెలిపిస్తే ఇంకెంత సాయం చేస్తాడో అని మాట్లాడుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ పవన్ కేవలం 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం..మొన్నటి వరకు పార్టీ లో కీలకంగా పనిచేసిన వారిని కాదని టీడీపీ నేతలకు టికెట్స్ ఇవ్వడం ఫై వారంతా మండిపడుతున్నారు. ఇదే విషయాన్నీ హరి రామజోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఒకరు ఇవ్వడం మరోకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ నిలదీసారు. జనసేన కు 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా అంటూ ఫైర్ అయ్యారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అని జోగయ్య నిలదీసారు. సీట్ల పంపకం మిత్రపక్షాల మద్య ఏ ప్రాతిపదికన చేసారని ప్రశ్నించారు. అన్నికులాల జనాభా ప్రాతిపధికన జరిగాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ తరహాలో నిర్ణయాలు పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ దుయ్యబట్టారు. జనసైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు.. పవన్ కు అధికారమని జోగయ్య స్పష్టం చేసారు. ప్రస్తుత సంక్షోభానికి ఒకటే మాత్ర అని జోగయ్య పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ చెరో రెండున్నారేళ్లు సీఎం పదవి.. రెండు పార్టీల నుంచి మంత్రి పదవుల పైన సమాన వాటా ఉండాలని చెప్పుకొచ్చారు.

మరి ఈయన చెప్పినట్లు చంద్రబాబు చేస్తాడా..? అసలు పవన్ మాట అక్కడ చెల్లుతుందా..? ఒకవేళ గెలిచినా తర్వాత పవన్ కళ్యాణ్ ను బాబు పట్టించుకుంటాడా..? అని జనసేన శ్రేణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి జనసేన కు 24 సీట్లు మాత్రమే కేటాయించడం సగటు అభిమాని కూడా తట్టుకోలేకపోతున్నారు.

Read Also : Chandrababu : ఈ 40 రోజులు చాల కీలకం..అభ్యర్థులకు బాబు హెచ్చరిక