Site icon HashtagU Telugu

Janasena : జనసేన టికెట్లు వీరికే ఇవ్వాలంటూ హరిరామజోగయ్య లేఖ..

Janasena Ts Ap

Janasena Ts Ap

ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తుండడం తో పార్టీల నేతల్లోనే కాదు ప్రజల్లో సైతం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..వచ్చిన వారు గెలుస్తారో లేదో..టికెట్ రాని నేతలు ఆ పార్టీ లోనే కొనసాగుతారో…లేక మరో పార్టీ లో చేరతారో ..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP) వరుసపెట్టి నేతల తాలూకా జాబితాలను విడుదల చేస్తుండగా..పొత్తులో ఉన్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు ఇంతవరకు అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించలేదు. ఈ తరుణంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య (Harirama Jogaiah)..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అభ్యర్థుల విషయంలో వరుస పెట్టి లేఖలు రాస్తున్నారు. మొన్నటి వరకు సీట్లకు సంబదించిన అంశాలపై లేఖలు రాయగా..తాజాగా ఇప్పుడు ఈ అభ్యర్థులకు జనసేన టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లు తెలియజేస్తూ లేఖ రాసారు.

లేఖలో ప్రస్తావించిన పేర్లు :

ఉమ్మడి తూర్పు గోదావరి

పిఠాపురం – తంగెళ్ల ఉదయ శ్రీనివాస్

కాకినాడ సిటీ – చిక్కాల దొరబాబు

కాకినాడ రూరల్ – పంతం నానాజీ

రాజమండ్రి – రూరల్ కె.దుర్గేష్

రాజానగరం – బత్తుల బాలకృష్ణ

కొత్తపేట – బండారు శ్రీనివాస్

రామచంద్రాపురం – పొలిశెట్టి చంద్రశేఖర్

ఉమ్మడి పశ్చిమ గోదావరి :

నరసాపురం ‌ ‌- పవన్ కల్యాణ్

భీమవరం – పవన్ కల్యాణ్

తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్

నిడదవోలు – చేగొండి సూర్యప్రకాష్

ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాస్

ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు (తూర్పు కాపు) లేదా నారా శేషు

ఉమ్మడి విశాఖ జిల్లా :

పెందుర్తి – పంచకర్ల రమేష్

యలమంచిలి – సుందరపు విజయకుమార్

చోడవరం – శివశంకర్

గాజువాక – సుందరపు సతీష్

అనకాపల్లి – బొలిశెట్టి సత్యనారాయణ

భీమిలి – పంచకర్ల సందీప్

విశాఖ ఉత్తరం – పసుపులేటి ఉషా కిరణ్

ఉమ్మడి కృష్ణా :

అవనిగడ్డ – బండ్రెడ్డి రామకృష్ణ లేదా బచ్చు వెంకట నాథ్ ప్రసాద్

పెడన – బూరగడ్డ వేదవ్యాస్ లేదా పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)

నూజివీడు – బర్మా ఫణిబాబు

ఉమ్మడి గుంటూరు :

గుంటూరు పడమర – తులసి రామ చరణ్

దర్శి – మద్దిశెట్టి వేణుగోపాలు

ఉమ్మడి ప్రకాశం :

గిద్దలూరు – ఆమంచి స్వాములు

ఉమ్మడి నెల్లూరు :

కావలి – మువ్వల రవీంద్ర

రాయలసీమ జిల్లాలు

మదనపల్లి – శ్రీరామ రామాంజనేయులు

చిత్తూరు – ఆదికేశవులు నాయుడు కుటుంబసభ్యులకు

తిరుపతి – కొణిదెల నాగబాబు

నంద్యాల – శెట్టి విజయ కుమార్

గుంతకల్లు – మణికంఠ

రాజంపేట – ఎమ్.వి. రావు

అనంతపూర్ – టి.సి. వరుణ్

పుట్టపర్తి – శివ శంకర్ (బ్లూ మూన్ విద్యాసంస్థలు)

తంబళ్లపల్లి – కొండా నరేంద్ర

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు :

ఎడ్చర్ల – పోగిన సురేష్ బాబు (తూర్పు కాపు)

నెల్లిమర్ల – లోకం మాధవి (తూర్పు కాపు)

విజయనగరం – గుర్రాల అయ్యలు లేదా పాలవలస యశస్విని (తూర్పు కాపు)

గజపతినగరం – పడాల అరుణ (తూర్పు కాపు)

పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా

నర్సాపురం – మల్లినీడి తిరుమలరావు (బాబి)

కాకినాడ – సాన సతీష్

విజయనగరం – గేదెల శ్రీనివాస్ (తూర్పు కాపు)

మచిలీపట్నం – బాలశౌరి

అనకాపల్లి – నాగబబు లేదా బొలిశెట్టి సత్యనారాయణ

రాజంపేట – యం.వి.రావు