హరిరామ జోగయ్య (Harirama Jogaiah) కొద్దీ నెలల క్రితం వరకు మీడియా లో ఈయన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వరుసగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు లేఖలు (Letter)రాస్తూ..హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఈయన లేఖలకు పరోక్షంగా పవన్ హెచ్చరికలు కూడా జారీ చేసారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో పెన్ను ..పేపర్ ను పక్కకు పెట్టి సైలెంట్ అయ్యాడు. అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ మళ్లీ పెన్ను ..పేపర్ పట్టుకొని పవన్ కళ్యాణ్ కు కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కు లేఖలు రాయడం మొదలుపెట్టారు. కాపు రిజర్వేషన్ అంశం ఫై తాజాగా జోగయ్య లేఖ రాసారు.
We’re now on WhatsApp. Click to Join.
కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని.. బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని లేఖలో ప్రస్తావించారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందని.. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. కాపులకు రిజర్వేషన్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన అనేక ఉద్యమాలు చేసిందని హరిరామ జోగయ్య తెలిపారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త ఆఫిడివిట్ దాఖలు చేయాలని కోరుతున్నామని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
Read Also : Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మిలియన్ల కొద్దీ కండోమ్‌ల పంపిణీ