Hari Rama Jogayya : కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించబోతున్న హరిరామ జోగయ్య

ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన ఆయన.. తాజాగా కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు

Published By: HashtagU Telugu Desk
Harirama Jogaiah

Harirama Jogaiah

హరిరామ జోగయ్య (Hari Rama Jogayya) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస లేఖలు రాస్తూ వచ్చిన ఆయన..ఆ లేఖలపై పవన్ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యేసరికి..పవన్ విషయంలో ఇకపై తలదూర్చిను అని చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో జనసేన కు సపోర్ట్ చేయను అన్నట్లు కూడా చెప్పకనే చెప్పాడు. కానీ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నారు.పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతు ఇవ్వాలనినిర్ణయించుకున్నట్లు తెలిపి జనసేన శ్రేణుల్లో భారీ ఊరట కల్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన ఆయన.. తాజాగా కాపు బలిజ సంక్షేమ సేన (Kapu Balija Sankshema Sena )ను స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం చేపట్టే సత్తా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని పోయి రాజ్యాధికారం చేపట్టడమే లక్ష్యంగా కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయం అని హరిరామ జోగయ్య ప్రకటించారు.

గతంలో ఉన్న కాపు సంక్షేమ సేన రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో నూతనంగా కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించామని,25 మంది సభ్యులు తో నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు హరిరామ జోగయ్య తెలిపారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టే సత్తా పవన్ కళ్యాణ్ కే ఉందని తాను నమ్ముతున్నట్లు జోగయ్య పేర్కొన్నారు. తన ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ లోని సభ్యులైన గుర్రాలు అన్నీ పవన్ కళ్యాణ్ వెంట పరుగులు పెడతాయన్నారు.

Read Also : Spirit : స్పిరిట్ మూవీ అప్డేట్.. ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనేది అప్పుడే?

  Last Updated: 29 Mar 2024, 01:00 PM IST