గత కొద్దీ రోజులుగా ఓ మహిళా అఘోరి (Naga Sadhu).. ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డేంజర్…అఘోరీ…నాగసాదు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారులో తిరుగుతూ హల్ చల్ చేస్తుంది. గత పది రోజుల క్రితం అనేక మీడియా చానెల్స్ కు ఇంటర్వూస్ ఇచ్చి హడావుడి చేసింది.
మాములుగా అఘోరాలు (Aghoralu) హిమాలయాల్లో..కాశీలో ఎక్కువగా దర్శనం ఇస్తుంటారు. ఒంటిమీద ఎలాంటి దుస్తులు లేకుండా..మొత్తం విబూది తో ఉంటారు. శ్మశానాలలో ..పాడుబడ్డ భవనాలలో జీవించటం, పూజలు, ప్రాణాయమాలు, తపస్సులు నిర్వహించటం, కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి, ఒళ్ళంతా రాసుకోవటం, పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించటం, అదే పుర్రెలో (కుక్క వంటి) జంతువులకు కూడా ఆహారదానం చేయటం, పొడవాటి ఎముకలను దండంగా వినియోగించటం, మానవ కళేబరాలను ఆహారంగా భుజించటం, శవాలతో సంభోగించటం వంటివి చేస్తుంటారు. ఇది మనకు తెలిసింది..కానీ ఈమె మాత్రం నగ్నంగా ఆలయాల్లో తిరుగుతూ వరుసగా ఇంటర్వూస్ ఇస్తుండడం తో ఈమెపై అనేక విమర్శలు , ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వారం రోజుల క్రితం.. తాను సనాతన ధర్మం(Sanatana Dharma) కోసం ఆత్మార్పణ(submission) చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేయడం తో అప్రమత్తమైన పోలీసులు ఆమెను రెండు రోజుల పాటు గృహనిర్బంధం చేశారు. అనంతరం ఆమెను మహారాష్ట్రకు తరలించారు. అయితే ఆమె అక్కడ నుండి ఏపీకి వస్తూ..అనకాపల్లి సమీపంలో ఉన్న నక్కపల్లి టోల్ గేట్(Nakkapally Toll Gate) సిబ్బందితో ఆమె గొడవకు దిగింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టోల్ గేట్ సిబ్బంది తన శరీరాన్ని తాకడమే కాకుండా.. సారీ చెబుతున్నారు. ఇలాంటి వారే.. మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా అత్యాచారాలు చేసి.. సారీ చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నాగసాధువు అయిన తనకు రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్లే కలియుగం ఇలా మారిపోయిందని, తాను సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం( ready to sacrificelife)గా ఉన్నానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. సాధువును తాకడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
Read Also : Sports Quota : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు – చంద్రబాబు