Azadi Ka Amrit Mahotsav: ఇంటింటా జెండా వందనం!

ఆంధ్రప్రదేశ్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి వీధిలో

  • Written By:
  • Updated On - July 18, 2022 / 06:27 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి వీధిలో 1.62 కోట్ల జాతీయ జెండాలను ఎగురవేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 13 నుండి ఆగస్టు 15 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ విజయవంతం చేయడానికి నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమం ప్రజలలో దేశభక్తి భావాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది. 75 ఏళ్లలో మన స్వాతంత్ర్య భారత యాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నందుకు గర్వపడతామని, ఈ వేడుకలను నిర్వహించడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని జగన్ అన్నారు. రాష్ట్రంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, అనేకసార్లు సమీక్షిస్తున్నామని జగన్ చెప్పారు.

“అన్ని పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు తమ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్)లో భాగంగా తమ ఉద్యోగులకు త్రివర్ణాన్ని అందించాలని కూడా వారికి కోరారు’’ సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 1.20 లక్షల మంది సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేస్తారని, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, కార్యాలయానికి 1.62 కోట్ల జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేందర్‌నాథ్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.