Site icon HashtagU Telugu

Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే లోకేశ్.. యువనేతకు పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్

Jagan Order

Lokesh Pawan

Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘‘పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బందులుపడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాలను అందించాలని కోరుకొంటున్నాను’’ అని పవన్ విష్ చేశారు.

నారా లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు. 2009 లో పార్టీ ప్ర‌చార మేనేజ‌ర్‌గా ఆయ‌న రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. అనంత‌రం రాజ‌కీయంగా ఎదిగి, శాస‌న‌మండ‌లికి ఎన్నికై, చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో ఐటీ, పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి అయ్యారు. నారా లోకేష్ స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ ప‌ట్టాను మ‌రియు కార్నేగీ మెల‌న్ విశ్వ‌విద్యాల‌యం నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్ లో స్పెష‌లైజేష‌న్‌తో బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్ ప‌ట్టాను పొందారు.

2009 పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గా పాల్గొంటూ, టీడీపీ రాజ‌కీయ కార్య‌కలాపాల‌ను నిర్వ‌హించ‌డం ప్రారంభించారు. చంద్ర‌బాబు నాయుడు, లోకేష్‌ను ఎమ్మెల్సీ గా ఎంపిక చేసి, అనంత‌రం త‌న మంత్రివ‌ర్గంలో ఐటీ, పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ది శాఖ‌ల మంత్రిగా నియ‌మించారు. 2014 నారా లోకేష్ టీడీపీ ప్రధాన కార్య‌ద‌ర్శి అయ్యారు. అనంత‌రం పార్టీలో అత్యున్న‌త నిర్ణ‌యాత్మ‌క విభాగ‌మైన పొలిట్‌బ్యూరోలో స‌భ్యుడిగా ఎదిగారు. ఇటీవల యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.