Alert: ఏపీపై వడగాల్పుల ఎఫెక్ట్.. రేపు ఆ మండలాల ప్రజలు అలర్ట్

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 08:29 PM IST

Alert: గురువారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు,129 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , 79 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11) ఉన్నాయి. శ్రీకాకుళం8, మన్యం జిల్లా పాలకొండ,సీతంపేట మండలాలు , విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(129) ఉన్నాయి. శ్రీకాకుళం17 , విజయనగరం24, పార్వతీపురంమన్యం11, అల్లూరిసీతారామరాజు8, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ9, కోనసీమ8, తూర్పుగోదావరి19, పశ్చిమగోదావరి3, ఏలూరు7, ఎన్టీఆర్2, గుంటూరు1, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోకవరం,విజయనగరం జిల్లా తుమ్మికపల్లి 42°C, శ్రీకాకుళం జిల్లా కొవిలం 41.8°C, నంద్యాల జిల్లా గోస్పాడులో 41.7°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 41.5°C, పార్వతీపురంమన్యం జిల్లా నవగాంలో 41.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 19 మండలాల్లో తీవ్రవడగాల్పులు, మిగిలిన చోట్ల 63 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.