Site icon HashtagU Telugu

GVMC Notices: విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు

Gvmc Notices

Gvmc Notices

GVMC Notices: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ టీడీపీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేసిన అధికారులు తాజాగా విశాఖలోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారని ఆరోపిస్తూ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని జోన్-2 టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్సార్సీపీ కార్యాలయంలో నోటీసును అతికించారు.

ఎండాడలోని సర్వే నంబర్‌ 175/4లో రెండెకరాల స్థలంలో అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంపై గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. జీవీఎంసీకి బదులుగా వీఎంఆర్‌డీఏకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై సంబంధిత వ్యక్తుల నుంచి జీవీఎంసీ వివరణ కోరింది.

వారం రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని జోన్-2 టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్సార్సీపీ కార్యాలయంలో నోటీసును అతికించారు. సదరు ఫైల్ వీఎంఆర్‌డీఏ అధికారుల పరిశీలనలో ఉందని గమనించిన వైఎస్సార్‌సీపీ సర్వే నంబర్‌ 175/4లోని లా కాలేజీ రోడ్డుకు ఆనుకుని దాదాపు రెండు ఎకరాల్లో బీసీసీ భవన గ్రౌండ్‌, మొదటి అంతస్తును అనధికారికంగా నిర్మించిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన తేదీ నుండి ఏడు రోజులలోపు పనిని ఆపివేయాలని మరియు ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని కోరింది.

Also Read: WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు..!