Christina: గుంటూరు జిల్లా(Guntur District)లో వైసీపీ(YCP)కి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జడ్పీ చైర్ పర్సన్9ZP chairperson)కత్తెర క్రిస్టినా(Christina), ఆమె భర్త సురేశ్ కుమార్ నేడు వైసీపీకి రాజీనామా(resignation) చేశారు. క్రిస్టినా, సురేశ్ కుమార్ దంపతులు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొల్లూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువాలు కప్పుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే క్రిస్టినా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త కత్తెర సురేశ్ కుమార్ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. అయితే, వైసీపీ అధిష్ఠానం ఇటీవల తాడికొండ అసెంబ్లీ సీటును మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు కేటాయించింది. ఈ కారణంగానే క్రిస్టినా దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.
Read Also: YS Jagan : సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నేతల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సొంత పార్టీల్లో సీట్లు దక్కని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలో వైసీపీకి కీలకమైన సామాజిక వర్గానికి చెందిన భార్యాభర్తలు ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు రాజీనామా లేఖ పంపారు. అనంతరం టీడీపీ తీర్దం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.