Site icon HashtagU Telugu

YCP : వైసీపీకి తప్పని షాకులు..

YSR Congress Party

YSR Congress Party

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు..అయినప్పటికీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రతి రోజు పెద్ద ఎత్తున వైసీపీ వీడి టీడీపీ లో చేరుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫై స్థాయి నేతల దగ్గరి నుండి కింది స్థాయి నేతల వరకు చాలామంది పసుపు కండువా కప్పుకోగా..తాజాగా గుంటూరు లో మరో షాక్ ఎదురైంది. వైసీపీకి చెందిన గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా (Guntur Deputy Mayor Sajeela ) వైసీపీని వీడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో వెళ్లి గుంటూరు లోక్ సభ కూటమి అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు. టీడీపీలో చేరేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో రేపు చంద్రబాబు సమక్షంలో వారంతా టీడీపీ లో చేరబోతున్నారు. గుంటూరు 2 (తూర్పు) అసెంబ్లీ స్ధానంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న షేక్ ముస్తఫా స్ధానంలో ఈసారి ఆయన కుమార్తె నూరీ ఫాతిమాకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ముస్తఫా స్ధానంలో తనకు గుంటూరు తూర్పు సీటు ఇవ్వాలని షేక్ సజీలా వైసీపీని కోరారు. అయితే ఆమె వినతిని జగన్ పట్టించుకోలేదు. దీంతో పార్టీ మారాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read Also : Heart Diseases: కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు కేసులు.. అసలు కారణం ఇదేనట