Site icon HashtagU Telugu

Guntur: ఇద్దరు మావోల అరెస్ట్.. మరో ఐదుగురు లొంగుబాటు!

Maoists

Maoists

హత్యలు, హత్యాయత్నాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మరో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు ప్రకటించారు. మావోయిస్టు కొర్రా నాగేశ్వరరావు, రూ. లక్ష రివార్డు ఉన్న సీంద్రి జగన్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. రెండు దశాబ్దాలుగా మావోయిస్టుల్లో చురుగ్గా పనిచేసిన వీరు మారు పేర్లతో రెండు జంట హత్యలు, ఒక హత్య సహా 100కు పైగా నేరాలకు పాల్పడ్డాడు.

2020, 2021లో పోలీసులతో జరిగిన కాల్పుల ఘటనలో అతను రెండుసార్లు తప్పించుకున్నాడు. జగన్ మాత్రం గాలికొండ ప్రాంతానికి చెందిన మావోయిస్టు దళంతో నిత్యం చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా పలు మావోయిస్టుల సమావేశాలకు పాల్గొంటున్నారు. లొంగిపోయిన ఐదుగురిలో ముగ్గురు పార్టీ సభ్యులు ఒక్కొక్కరి తలపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్టు డీజీపీ తెలిపారు. అయితే వోయిస్టుల కార్యకలాపాలకు ప్రజల నుంచి ఆదరణ లేకపోవడం, గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఫలితాలు ఇస్తుండటం వల్ల మిగతా మావోయిస్టులు లొంగిపోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.