Site icon HashtagU Telugu

YS Sharmila : షర్మిల వెంట గుమ్మనూరు జయరాం..?

Jayaram Congress

Jayaram Congress

ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని తెలియడం తో జగన్..వారందర్ని మార్చే పనిలో పడ్డారు. కొన్ని స్థానాల్లో మార్పులు చేస్తుండగా..చాలామందికి ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెపుతున్నారు. ఇప్పటీకే రెండు లిస్ట్ లు విడుదల చేసి దాదాపు 30 మందికి షాక్ ఇవ్వగా ..మూడో లిస్ట్ లో కూడా దాదాపు 27 మందికి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. టికెట్ రానివారే కాదు..రాదని తెలిసిన వారు సైతం ఇక పార్టీ లో ఉండేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఇప్పటీకే పలువురు టీడీపీ , వైసీపీ పార్టీలలో చేరగా…మరికొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వైస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొడుకు పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్న షర్మిల..ఆ తంతు పూర్తి కాగానే పూర్తిగా రాజకీయాల్లో బిజీ కానున్నారు. ప్రస్తుతం ఈమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడురాలుగా చేయాలనీ కాంగ్రెస్ భావిస్తుంది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నేతలతో పాటు వైస్ అభిమానులైన నేతలు సైతం షర్మిల వెంట నడవాలని చూస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి..వైసీపీ కి రాజీనామా చేసి , షర్మిల వెంట నడవబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఇదే తరుణంలో గుమ్మనూరు జయరాం..సైతం ఆళ్ల బాటలోనే నడిచేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆలూరు(Alur)లో మంత్రి గుమ్మనూరు జయరాం(Minister Gummanur Jayaram)ను తప్పించి..ఎమ్మెల్సీ మధుసూదన్(mlc Madhusudan)కు పగ్గాలిచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్నీ జయరాం కు తెలియజేసిందట..అయినప్పటికీ జగన్ ఫై ఉన్న నమ్మకం తో మూడో లిస్ట్ విడుదల వరకు ఎదురు చూసి..ఆ లిస్ట్ లో తన పేరు రాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచన చేద్దాం అన్నట్లు ఉన్నాడట. ఇదే క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ నేతలతో కూడా టచ్ లో ఉన్నాడట. వైసీపీ టికెట్ రానిపక్షంలో కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నాడట. కర్ణాటక ప్రభుత్వంలో గుమ్మనూరు జయరాం సోదరుడు నాగేంద్ర మంత్రి(minister Nagendr)గా ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shivakumar)తో వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే వైఎస్ షర్మిల(YS Sharmila) సారథ్యం వహిస్తే కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నాడట. చూడాలి ఏంజరుగుతుందో..

Read Also : Tollywood : టాలీవుడ్ లో మరో విషాదం..గుండెపోటుతో డైరెక్టర్ మృతి