Site icon HashtagU Telugu

Yogandhra 2025: ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు – ప్రధాని మోడీ హర్షం

Modi Yogandhra 2025

Modi Yogandhra 2025

ఆంధ్రప్రదేశ్‌లో యోగా(Yoga)ను జీవనశైలి భాగంగా రూపొందించేందుకు జరుగుతున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ప్రశంసించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నిర్వహించిన “యోగాంధ్ర” (Yogandhra 2025) కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందిస్తూ.. యోగా ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేశారు. యోగా ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సు సాధ్యమవుతుందని, ఇది ప్రజలను ఏకం చేసే సాధనమని ఆయన పేర్కొన్నారు.

Asaduddin Owaisi : మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చెలరేగితే భారతీయుల భద్రత ఆందోళనకరం

విశాఖపట్నంలో జరిగిన ఈ భారీ యోగా కార్యక్రమంలో ప్రజల పాల్గొనడాన్ని ప్రధాని అభినందించారు. “యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ జీవితంలో యోగాను భాగం చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఎంతో అభినందనీయం. నేను కూడా పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం, అనేక మందిని ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రేరేపిస్తోంది” అంటూ మోదీ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ఇది సమాజ సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.